కరోనా కట్టడికి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు.. పబ్బులు, మద్యం దుకాణాల ఆంక్షలపై ఆరా..!

రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

  • Balaraju Goud
  • Publish Date - 12:10 pm, Mon, 19 April 21
కరోనా కట్టడికి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..  పబ్బులు, మద్యం దుకాణాల ఆంక్షలపై ఆరా..!
Telangana High Court

Telangana Covid 19: రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై ధర్మాసనానికి నివేదికను సమర్పించింది. అయితే, జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని పేర్కొన్న కోర్టు.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. క్లబ్బులు, థియేటర్లు, పబ్బులు, మద్యం షాపులపై కరోనా ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది.

అలాగే, వంద మందికి పైగా సిబ్బంది ఉన్న ప్రతీ ఆఫీస్‌లో కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని పేర్కొంది. కరోనా టెస్టులను భారీగా పెంచాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. లాక్‌డౌన్ లేకపోయినా.. కనీసం కంటైన్మెంట్ జోన్లు అయినా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, దీనికోసం నిపుణులతో కమిటీ వేయాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు.

కాగా, ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని.. మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.

Read Also…  కోవిడ్ 19 డ్యూటీ చేస్తూ మరణించిన హెల్త్ కేర్ వర్కర్లకు ఇన్సూరెన్స్ కవరేజీ రద్దు, కేంద్రం

National lockdown: జాతీయ స్థాయి లాక్‌డౌన్? మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఏమన్నారంటే..?

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు