Telangana corona: దేశం నలుమూలల కమ్మేసిన కరోనా మహమ్మారి.. తెలంగాణలో కొత్తగా 4,009 మందికి పాజిటివ్

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ రాష్ట్రం.. ఈ నగరం అనే తేడా లేదు. దేశం నలుమూలలనూ మహమ్మారి కమ్మేసింది.

Telangana corona: దేశం నలుమూలల కమ్మేసిన కరోనా మహమ్మారి.. తెలంగాణలో కొత్తగా 4,009 మందికి పాజిటివ్
Follow us

|

Updated on: Apr 19, 2021 | 10:33 AM

Telangana corona cases: భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ రాష్ట్రం.. ఈ నగరం అనే తేడా లేదు. దేశం నలుమూలలనూ మహమ్మారి కమ్మేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వల్పంగా త‌గ్గాయి. శ‌నివారం 5 వేల‌కుపైగా న‌మోద‌వ‌గా, ఆదివారం ఆ సంఖ్య 4 వేల‌కు పడిపోయింది. రాష్ట్రంలో శనివారం రాత్రి 8గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్తగా 4,009 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,55,433 మంది కరోనా బారినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

ఇక ఆదివారం ఒక్కరోజే 1,878 మంది బాధితులు క‌రోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే, గడిచిన 24 గంటల వ్యవధిలో మ‌రో 14 మంది వైర‌స్ బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం ఇప్పటివరకు 1,838 మంది మ‌ర‌ణించ‌గా, 3,14,441 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కొత్తగా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 705 ఉండ‌గా, మేడ్చల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 363, నిజామాబాద్‌లో 360, రంగారెడ్డి జిల్లాలో 336, సంగారెడ్డిలో 264 చొప్పున కేసులు న‌మోద‌య్యాయి. కాగా, రాష్ట్రంలో నిన్న 83,089 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Telangana Corona

Telangana Corona

Read Also… Corona: దేశంలో కరోనా విలయతాండవం.. కోటిన్నర దాటిన కేసుల సంఖ్య.. నిన్న కూడా రికార్డు స్థాయిలోనే..

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు