Covid-19: ‘మహా’ రూల్స్.. ఆ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా రిపోర్ట్ చూపించాల్సిందే..
Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే
Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ డ్రగ్స్, వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తమ రాష్ర్టానికి ఆక్సిజన్ సిలిండర్లను, డ్రగ్స్, వ్యాక్సిన్ డోసులను సమకూర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, కేరళ, గోవా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా కూడా కరోనా వ్యాప్తి మరింత పెరుగుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ మేరకు మహారాష్ట్ర వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఆంక్షలు ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేరళ, గోవా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సిఆర్ రీజియన్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. 48గంటల్లో ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సిందేని స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ నుంచి వచ్చే ప్రయాణికులకు 15 రోజులపాటు హోం క్వారంటైన్ తప్పనిసరని తెలిపింది. ఇదిలాఉంటే.. గత 24గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 68,631 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతోపాటు ఈ మహమ్మారి బారిన పడి 503 మంది మృతి చెందారు. ఎక్కువగా ముంబైలోనే 53వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటూ కరోనా కట్టడికి ప్రయాత్నాలు చేస్తోంది.
Also Read: