కోవిడ్ కారణంగా ఇండియాకు విమానాలను నిలిపివేసిన హాంకాంగ్, పాకిస్తాన్ కి కూడా !

కోవిడ్ కారణంగా ఇండియాకు విమానాలను నిలిపివేసిన  హాంకాంగ్, పాకిస్తాన్ కి కూడా !
Hongkong Suspends Flights Connecting

ఇండియాలో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో హాంకాంగ్ తన విమాన  సర్వీసులను నిలిపివేసింది.  ఈ  నెల 20 నుంచి మే 3 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Umakanth Rao

| Edited By: Phani CH

Apr 19, 2021 | 10:55 AM

ఇండియాలో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో హాంకాంగ్ తన విమాన  సర్వీసులను నిలిపివేసింది.  ఈ  నెల 20 నుంచి మే 3 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ నుంచి  వచ్చే విమానాలకు, ఆ దేశాలకు తమ విమానాశ్రయం నుంచి వెళ్లే విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు హాంకాంగ్ ప్రభుత్వం తెలిపింది. వీటికి కూడా ఇదే కాలం వర్తిస్తుంది. ఈ నెలలో రెండు విస్తారా విమానాలనుంచి హాంకాంగ్ చేరిన 50 మంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్ విజిట్ చేయగోరిన ప్రయాణికులెవరైనా తప్పనిసరిగా  72 గంటల ముందు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, నెగెటివ్ అని తేలితేనే వారిని నగరంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ముంబై-హాంకాంగ్ రూట్ లో ప్రయాణించే అన్ని విస్తారా విమాన సర్వీసులను మే 2 వరకు నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 4 న ఢిల్లీ-హాంకాంగ్ రూట్ లో విస్తారా ప్లేన్ లో ప్రయాణించిన సుమారు 47 మంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది.

ఈ ఉదంతంపై వ్యాఖ్యానించేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ నిరాకరించింది. ఇండియాలో నిన్న ఒక్కరోజే రెండు లక్షల 61 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.  దీంతో ఈ సంఖ్య  మొత్తం కోటీ 47 లక్షలకు పైగా చేరింది. తాజాగా  1500 మందికి పైగా మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య  లక్షా 77 వేలకు చేరింది.

మరిన్ని ఇక్కడ చూడండి: వేయిపడగల విషసర్పంలా కాటేస్తున్న కరోనా మహమ్మారి

Coronavirus Masks: కరోనా నివారణ కోసం క్లాత్ మాస్కులను వాడుతున్నారా.. వాటిని శుభ్రం చేసుకునే పధ్ధతి ఏమిటో తెలుసా..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu