The Dog and Cat: పని ఒత్తిడిలో ఉన్నారా? అర్జెంట్ గా ఈ వీడియో చూసేయండి.. కచ్చితంగా రిలీఫ్ వస్తుంది!

పెంపుడు జంతువులు చేసే కొన్ని పనులు మనసుకు భలే ఆహ్లాదాన్ని ఇస్తాయి. అందులోనూ కుక్క.. పిల్లి.. ఈ రెండిటి చేష్టలు ఒక్కోసారి ఇట్టే ఆకట్టుకుంటాయి. అప్పుడే ఒకదానితో ఒకటి కొట్టుకుంటున్నట్టు ఉంటాయి

The Dog and Cat: పని ఒత్తిడిలో ఉన్నారా? అర్జెంట్ గా ఈ వీడియో చూసేయండి.. కచ్చితంగా రిలీఫ్ వస్తుంది!
Dog And Cat
Follow us
KVD Varma

|

Updated on: Apr 20, 2021 | 5:32 PM

The Dog and Cat: పెంపుడు జంతువులు చేసే కొన్ని పనులు మనసుకు భలే ఆహ్లాదాన్ని ఇస్తాయి. అందులోనూ కుక్క.. పిల్లి.. ఈ రెండిటి చేష్టలు ఒక్కోసారి ఇట్టే ఆకట్టుకుంటాయి. అప్పుడే ఒకదానితో ఒకటి కొట్టుకుంటున్నట్టు ఉంటాయి.. మళ్ళీ అప్పుడే ఒకదానిపై ఒకటి విపరీతమైన ప్రేమను చూపించుకుంటూ.. చూస్తున్న మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీటి ప్రవర్తనను చూస్తె మనికి ఒత్తిడి ఎగిరిపోతుంది. ఏమిటీ ఇలా చెబుతున్నారు అనుకునుతున్నారా? ఈ వీడియో చూస్తె మీరు అంటారు.. నిజంగానే మనసుకు చాలా హాయి అనిపించింది అని. ఇదేమీ పెద్ద వీడియో కాదు.. ఒక పెంపుడు కుక్క, పిల్లి ఉన్న చిన్న వీడియో.

ఒక చిన్న కుక్క తన మానాన తాను హాయిగా ప్రశాంతంగా నిద్రపోతోంది. ఇంతలో ఓ పిల్లి పిల్ల దాని దగ్గరకు వచ్చింది. మెల్లగా దానిమీదకు ఎక్కింది. ఆ కుక్క మొహం పై తన మొహం పెట్టి పడుకుంది. ఇలా పిల్లి చేస్తున్న సమయంలో ఆ కుక్క ఒకసారి కళ్ళు విప్పి చూసి.. నువ్వా.. అన్నట్టు పిల్లిని ఓ లుక్ వేసి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. కొంత సేపటికి ఆ పిల్లి కూడా కుక్క తలమీద తల పెట్టి.. తన శరీరాన్ని మొత్తం కుక్కకు ఆన్చి నిద్రపోయింది. ఈ సమయంలో కుక్క తన కాలిని మెల్లగా పిల్లి పడిపోకుండా ఉండేట్టు సర్దుకుంది..

ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ రెండిటి బంధానికి ఫిదా అయిపోయారు. అందరూ తెగ కామెంట్లు పెట్టేశారు. అన్నట్టు ఈ వీడియో ఎంత మంది చూశారో తెలుసా..దాదాపు ఇరవై లక్షల మంది.. ఎంత మంది లైకారో తెలుసా.. 18 లక్షల మంది. అంటే చూసిన వారిలో 90 శాతం ఈ వీడియోకు ఫ్లాట్ అయిపోయారన్న మాట. ఈ కుక్క-పిల్లి సఖ్యత చూస్తే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం.. మేం చెప్పేది మీరు నమ్మక పొతే ఈ కింద వీడియో చూడండి.. మీకు కచ్చితంగా నచ్చుతుందని హామీ మాది!