Dinosaur: మా ఇంటి తోటలో బుల్లి డైనోసార్ తిరుగుతోంది.. జాగ్రత్త.. వైరల్ గా మారిన ఓ మహిళ వీడియో.. ఇంతకీ అది ఏమిటి? Viral Video

మన కళ్ళు మనల్ని మోసం చేయడం చాలా సహజంగా జరుగుతుంది. అందులోనూ చీకటి సమయంలో మరీ ఎక్కువగా మోసపోతాం. మనం ఎక్కువగా దెయ్యాలు..భూతాలూ లాంటివి నమ్మితే ఇక అంతే..

Dinosaur: మా ఇంటి తోటలో బుల్లి డైనోసార్ తిరుగుతోంది.. జాగ్రత్త.. వైరల్ గా మారిన ఓ మహిళ వీడియో.. ఇంతకీ అది ఏమిటి? Viral Video
Dinosaur Florida
Follow us
KVD Varma

|

Updated on: Apr 20, 2021 | 6:07 PM

Dinosaur: మన కళ్ళు మనల్ని మోసం చేయడం చాలా సహజంగా జరుగుతుంది. అందులోనూ చీకటి సమయంలో మరీ ఎక్కువగా మోసపోతాం. మనం ఎక్కువగా దెయ్యాలు..భూతాలూ లాంటివి నమ్మితే ఇక అంతే.. రాత్రి సమయంలో ఇంట్లో గోడమీద మన చేతి నీడ కనబడినా ఒక్కోసారి ఉలిక్కిపదతాం. చిన్న చప్పుడు వినిపిస్తే.. అదిరిపోతాం. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అయితే, మనం అనుభవంలోకి వచ్చిన అటువంటి భయాలను ఎవరితోనైనా చెబితే అది వారికి నవ్వులాటగా అనిపిస్తుంది. అదీకాకపోయినా, ఒక్కోసారి ఆ భయానక అనుభవం అనుకున్న మనమే కొద్ది సేపటి తరువాత దానిని తలుచుకుని నవ్వుకుంటాం. అటువంటి అనుభవమే ఫ్లోరిడాలో ఉంటున్న ఓ మహిళకు కలిగింది. అది ఏమిటో చూద్దాం..

ఈ మహిళ పేరు క్రిస్టినా రేయాన్. ఫ్లోరిడాలో ఉంటుంది. ఈమె ఉంటున్న ఇంటికి భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. ఒక రోజు ఉదయాన్నే లేచి రాత్రి ఆ కెమెరాల్లో ఏమి వుందో చూద్దామని చూడడం మొదలు పెట్టింది ఆమె. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత ఓ జంతువు వేగంగా తమ తోటలో ఇటు నుంచి అటు వేగంగా పరిగెత్తి నట్టు కనిపించింది. అంతే.. ఇంకేముంది ఆమె గుండె ఆగిపోయింది. ఆ కెమెరా రికార్డింగ్ లో కనబడిన జంతువు అచ్చు పిల్ల డైనోసార్ లా కనిపించింది ఆమెకు. అంతే.. ఆమె ఇంక ఏమాత్రం ఆలోచించలేదు. తన ఇంటి తోటలో పిల్ల డైనోసార్ తిరుగుతోంది అంటూ ఆ వీడియో క్లిప్ ను అందరికీ షేర్ చేసేసింది. అంతే కాదు ఆమె ఆ డైనోసార్ ను అద్భుతంగా వర్ణించేసింది కూడా. దీంతో ఆ వీడియో చూసిన అందరూ ఛ.. అదేమీ డైనోసార్ కాదు.. ఎదో కుక్కలాంటి జంతువు వేగంగా పరిగెత్తింది. చీకట్లో అది అలా కనిపిస్తోంది అంతే అంటూ ఆమెకు చెప్పారు. అయితే, అప్పటికే ఈ వీడియో వైరల్ అయిపొయింది. దీంతో మీడియా ఆమెను దాని గురించి ప్రశ్నించింది. దీంతో ఆమె ఫాక్స్ 35 న్యూస్ ఛానెల్ తో..”మనం ఏదైనా గుర్తు తెలీని జంతువును తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో చూస్తె భయం వేయదా మరి.. బహుశా జురాసిక్ పార్క్ సినిమా ఎక్కువసార్లు చూసినందుకు కావచ్చు.. నాకు కనిపించిన జంతువును నేను చిన్న డైనోసార్ అనుకున్నాను.” అని చెప్పింది.

ఇదిగో ఆ వీడియో మీకోసం ఇస్తున్నాం.. మరి అది ఏ జంతువో మీరు కనిపెట్టగలరేమో ప్రయత్నించండి!

Also Read: ఆస్కార్ అవార్డు ఇస్తేగిస్తే దీనికే ఇవ్వాలి…పెంపుడు శునకం యాక్టింగ్ స్కిల్స్ చూడండి…Viral Video

రియల్ హీరో, రైలు కింద పడిపోబోయిన చిన్నారిని రక్షించిన రైల్వే ఉద్యోగి, ఎక్కడంటే?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!