AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం అంటే ఇదే మరి.. చెత్త కుప్ప నుంచి మంత్రి ఆఫీసులోకి చేరిన మార్జాలము.. వివరాలు చూసేద్దామా..

అదృష్టం అంటే ఆ పిల్లిదే. చెత్త కుప్పలో కుక్క చావు చావాల్సిన ఆ పిల్లి ఏకంగా మంత్రి గారి ఆఫీసులోనే రాజభోగాలను అనుభవిస్తుంది.

అదృష్టం అంటే ఇదే మరి.. చెత్త కుప్ప నుంచి మంత్రి ఆఫీసులోకి చేరిన మార్జాలము.. వివరాలు చూసేద్దామా..
Rajitha Chanti
|

Updated on: Dec 25, 2020 | 4:55 PM

Share

అదృష్టం అంటే ఆ పిల్లిదే. చెత్త కుప్పలో కుక్క చావు చావాల్సిన ఆ పిల్లి ఏకంగా మంత్రి గారి ఆఫీసులోనే రాజభోగాలను అనుభవిస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం ఆ పిల్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. గత సోమవారం రష్యాలోని ఉలియానోవ్స్కలో మున్సిపాలిటీ సిబ్బంది ఇద్దరు చెత్తను ముక్కలు చేసే మిషిన్ దగ్గర నిల్చున్నారు. అదే సమయంలో ఆ చెత్తలోని ఓ తెల్లటి ప్లాస్టిక్ కవర్ కదలడం అందులో ఒకతను గమనించాడు. వెంటనే దాని తీసుకొని ఓపెన్ చేసి చూడగా.. అందులో ఒక చిన్న పిల్లి కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో అక్కడ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ పిల్లిని దత్తత తీసుకుంది. అంతేకాకుండా దానికి అనధికారికంగా పర్యావరణ శాఖ డిప్యూటీ మంత్రి హోదాను కల్పించింది. మంత్రి గారి ఆఫీసులోని ఓ కుర్చీలో ఆ పిల్లి నిద్రపోతున్న, ఆడుతున్న ఫోటోలను మంత్రి గుల్నారా కఖ్మతులిన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాదండోయ్ ఆ పిల్లికి ఒక పేరు పెట్టడం కోసం ఓ కంటెస్ట్‏ను కూడా పెట్టారు. ‘పిల్లులు పెంచుకునే యజమానులు వాటి బాధ్యతను సక్రమంగా వ్వహహరించాలి. మీరు వాటిని సరిగ్గా చూసుకోలేకపోతే.. మంచిగా పెంచుకునే వారికి ఆ పిల్లులను ఇచ్చేయండి’ అని మంత్రి గుల్నారా కఖ్మతులిన తెలిపారు.

AP EAPCET 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. లింక్ ఇదే
AP EAPCET 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. లింక్ ఇదే
ఆర్బీఐ శుభవార్త.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
ఆర్బీఐ శుభవార్త.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో
కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో
సైబర్ నేరాల్లో డబ్బులు పోయాయా..? రూ.25 వేల ఆర్దిక సాయం
సైబర్ నేరాల్లో డబ్బులు పోయాయా..? రూ.25 వేల ఆర్దిక సాయం
3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
వామ్మో.. రైల్లో ప్రయాణిస్తున్న పాములు.. శాస్త్రవేత్తల పరిశోధనలో..
వామ్మో.. రైల్లో ప్రయాణిస్తున్న పాములు.. శాస్త్రవేత్తల పరిశోధనలో..
ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..!
ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..!
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు