Telangana corona: తెలంగాణ మరోసారి కోరలుచాస్తున్న మహమ్మారి.. కొత్తగా 5926 మందికి పాజిటివ్, 18 మంది మృతి

తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా 5,926 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359 కి చేరింది.

Telangana corona: తెలంగాణ మరోసారి కోరలుచాస్తున్న మహమ్మారి.. కొత్తగా 5926 మందికి పాజిటివ్, 18 మంది మృతి
Telangana Coronavirus
Follow us
Balaraju Goud

| Edited By: Team Veegam

Updated on: Apr 20, 2021 | 12:16 PM

Telangana covid 19: తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 1,22,143 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో తాజాగా 5,926 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌‌లో వెల్లడించింది. నిన్న కరోనా వైరస్ బారిన పడి 18 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1856కి చేరింది.

మరోవైపు కరోనా బారి నుంచి నిన్న 2,209 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,16,650 కి చేరింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 42,853 ఉండగా.. కొందరు ఆసుపత్రిలో, మరికొందరు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 793 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,19,42,985కి చేరింది.

ఇక జిల్లాల వారీ నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి….

Telangana Corona