Oxygen Shortage: వెల్లూరులో విషాదం.. ఆక్సిజన్ లేక ఏడుగురు కరోనా బాధితులు మృతి..
Covid-19 patients dead: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నాలుగైదు రోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో మరణాలు
Covid-19 patients dead: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నాలుగైదు రోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో పలు రాష్ట్రాల్లో చాలా మంది కరోనా బాధితులు మరణిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరతతో చాలామంది కరోనా రోగులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆక్సిజన్ కొరతతో తమిళనాడులో కూడా ఏడుగురు కరోనా బాధితులు మరణించారు. రాష్ట్రంలోని వెల్లురు జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
సోమవారం వెల్లూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో.. కరోనా రోగులు ఒక్కొక్కరిగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆసుపత్రి ఎదుట కోవిడ్ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు. తమ కళ్ల ఎదుటే కుటుంబసభ్యులు మరణించారంటూ.. రోదిస్తున్నారు. దీంతో వెల్లూరులో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. చాలామంది కోవిడ్ పేషంట్లు ఈ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పలువురికి ఆక్సిజన్ లేక.. అంబులెన్సుల్లో ఉన్న సిలిండర్లతో చికిత్స అందిస్తున్నారు. అయితే మరికొంత మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. దీంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
కాగా తమిళనాడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం 11వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. 100 మంది వరకూ మరణిస్తున్నారు. ప్రస్తుతం వెల్లురు సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ సూచన మేరకు వెల్లూరు కలెక్టర్ ఆసుపత్రి అధికారులతో పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా చర్యలు ప్రారంభించారు.
Also Read: