Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. షూటింగ్ గురించి చెప్పుకోచ్చిన డైరెక్టర్..

AdiPurush Movie Update: బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధేశ్యామ్,

Adipurush: 'ఆదిపురుష్' సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‏డేట్..  షూటింగ్ గురించి చెప్పుకోచ్చిన డైరెక్టర్..
Adipurush Movie Update
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 20, 2021 | 6:45 AM

AdiPurush Movie Update: బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధ కృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. అటు కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ పాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’.  3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ఓ న్యూస్‌పై డైరెక్టర్‌ ఓం రౌత్‌ క్లారిటీ ఇచ్చాడు

దాదాపు 30 శాతం ‘ఆదిపురుష్’ షూట్ పూర్తయిందని, సినిమాలోని ప్రధాన పాత్రధారులు గత సంవత్సరం ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీని పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఈ చిత్రం కోసం ప్రభాస్, సైఫ్ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ లోకి చేంజ్ అయ్యారు. ఇక కృతితో పని చేయడం గొప్ప అనుభవం అంటూ టీంపై ప్రశంసలు కురిపించాడు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. కృతి సనన్ సీత పాత్ర, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలు పోషిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా వెల్లడించారు.

Also Read: Keerthi Suresh: జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‏గా కీర్తిసురేష్.. చీరకట్టులో ‘మహానటి’ బ్యూటీఫుల్ పిక్స్..

నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..

Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..