Rajitha Chanti |
Updated on: Apr 20, 2021 | 2:22 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా 'బద్రి'. ఈ సినిమా విడుదలైన నేటికి 21 ఏళ్ళు పూర్తవుతాయి.
ఈ సినిమాలో కథానాయికలుగా రేణు దేశాయ్, అమీషా పటేల్ నటించారు. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు రేణు దేశాయ్ పరిచయమైంది.
పవన్ కళ్యాణ్ మ్యానరిజం, పూరి డైలాగ్స్, రమణ గోగుల సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్. నువ్వు నంద అయితే, నేను బద్రి.. బద్రీనాథ్.. అయితే ఏంటి?’ అంటూ పవన్-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలకు ఇప్పటికీ అదే క్రేజ్ వుంది.
85 థియేటర్లలో 50 డేస్, 47 థియేటర్లలో హండ్రెడ్ డేస్ జరుపుకున్న ఈ సినిమా అమెరికాలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా కూడా చరిత్ర సృష్టించింది.
టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లోనే 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
అలాంటి ఈ సినిమా విజయవంతంగా 21 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో 'బద్రి21ఇయర్స్' అనే ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రేణు దేశాయ్, అమీషా పటేల్ ఇద్దరూ పవన్ సరసన హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరికీ ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. తరువాతి రోజుల్లో రేణుదేశాయ్ పవన్ జీవితంలో కి భార్య కూడా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే.