Corona Vaccine: వినుత్న కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ తీసుకుంటే టమోటాలు ఫ్రీ..
Corona Virus: దేశ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో రోజుకీ
Corona Virus: దేశ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో రోజుకీ 2 లక్షలకు పైగా కేసులు వస్తుండగా.. మరణాల రేటు గణనీయంగా పెరుగుతోంది. ఇక అటు దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణి జరుగుతున్న కానీ.. కోవిడ్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. మరోవైపు పలు ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత ఏర్పడి ఎంతోమంది ప్రాణాలను వదులుతున్నారు. కరోనా ముందు ఎవరు తక్కువ కాదంటూ.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే తెలంగాణ సీఎం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక కరోనా వ్యాప్తి అధికమవుతున్న కారణాంగా కోవిడ్ టీకా తీసుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. టీకా తీసుకుంటే ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రజలలో నుంచి వ్యాక్సిన్ పట్ల ఉన్న అనుమానాలను తొలగించడమే కాకుండా.. టీకా అందరు వేసుకునే విధంగా ప్రభుత్వం ఓ వినుత్న నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు చత్తీస్ గడ్లోని పురపాలక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టీకా వేసుకున్న వారందరికీ టమోటాలు ఉచితంగా ఇస్తోంది. కరోనా టీక తీసుకున్న వారందరీకి టమోటాలను అందిస్తున్నామని బీజాపూర్ మున్సిపల్ అధికారులు తెలిపారు. టీకా తీసుకోవడానికి ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని.. రైతుల నుంచి టమోటాలు సేకరించి వాటిని టీకా వేసుకున్న వారికి పంచుతున్నమని తెలిపారు. అటు చత్తీస్ గడ్లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 6083 మంది కరోనాతో మరణించారు. ఇక ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మిని లాక్ డౌన్ (వారం రోజులు) విధించగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్య్ఫూ విధించింది.
Also Read: EPF Amount: UAN నంబర్ లేకుండానే PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..
ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..