Petrol Diesel price Today: ఆంధ్రప్రదేశ్‌లోనే స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..

Petrol, Diesel Rates Today:దేశంలో ఇటీవల కాలంలో చమురు ధరలకు బ్రేక్ పడుతూ వస్తోంది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనాదారులకు

  • Shaik Madarsaheb
  • Publish Date - 6:47 am, Wed, 21 April 21
Petrol Diesel price Today: ఆంధ్రప్రదేశ్‌లోనే స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
petrol diesel prices

Petrol, Diesel Rates Today:దేశంలో ఇటీవల కాలంలో చమురు ధరలకు బ్రేక్ పడుతూ వస్తోంది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనాదారులకు కాస్త ఉపశమనం కలుగుతోంది. అంతకుముందు ప్రతిరోజూ భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల జేబులు గుల్లయ్యాయి. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో ప్రజల జేబులు గుల్లయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు అన్నిచోట్ల స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప వ్యాత్యాసం ఏర్పడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది.
బెంగాల్‌లోని కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా..
హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.45 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.46గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి..
విజయవాడలో నిన్న లీటర్ పెట్రోల్ ధరరూ.96.44 ఉండగా.. బుధవారం స్వల్పంగా పెరిగింది. ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.52 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.04 గా ఉంది.
విశాఖపట్నంలో ధర స్వల్పంగా తగ్గింది. పెట్రోల్‌ ధర రూ.95.57 నుంచి 95.36 కి తగ్గింది. డీజిల్‌ ధర రూ.88.92 గా ఉంది.
విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.69 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.22 గా ఉంది.

Also Read:

Corona Vaccine: వినుత్న కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ తీసుకుంటే టమోటాలు ఫ్రీ..

Bus Accident: వలస కూలీలతో వెళుతున్న బస్సు బోల్తా… ముగ్గురు మృతి, పలువురికి గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం