Plasma Therapy: ప్లాస్మా అంటే ఏమిటి.. కరోనా పేషేంట్స్ చికిత్స కు ఎందుకు ఉపయోగిస్తారంటే..

Plasma Therapy: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ప్లాస్మా. కరోనా వైరస్ బారినుంచి భయపడిన వారు.. ఈ వైరస్ తో..

Plasma Therapy: ప్లాస్మా అంటే ఏమిటి.. కరోనా పేషేంట్స్ చికిత్స కు ఎందుకు ఉపయోగిస్తారంటే..
Plasma Covid
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2021 | 8:59 AM

Plasma Therapy: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ప్లాస్మా. కరోనా వైరస్ బారినుంచి భయపడిన వారు.. ఈ వైరస్ తో ప్రాణాల కోసం పోరాడుతున్న వారికి చేసే జీవదానం ప్లాస్మా. అయితే ఎవరైనా సరే రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు,ప్లాస్మా అనగానే బయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్లాస్మా అంటే ఏమిటి.. కరోనా చికిత్సగా ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

రక్తంలో ప్లేట్‌లెట్లు, ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా లాంటి పదార్ధాలు ఉంటాయి. ప్లాస్మా అనేది రక్తంలో ఉండే ఒక ద్రవ పదార్ధం. ఇది మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ . దీనినే ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. అటువంటి యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి.. కనుక ఎవరైనా కోవిడ్ బారిన పడి.. సీరియస్ కండిషన్ లో ఉంటె.. అటువంటి పేషేంట్స్ కు ఈ ప్లాస్మాని ఎక్కిస్తున్నారు.

అప్పటికే కరోనా సోకి కోలుకున్న వారి నుంచి పేషేంట్స్ కు ప్లాస్మా ను ఎక్కిస్తే.. త్వరగా కోలుకోవడమే కాదు.. ప్రాణాపాయం నుంచి కూడా భయపడే అవకాశం ఉంది.. కనుకనే సెలబ్రెటీల నుంచి ప్రభుత్వ అధికారుల వరకూ ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి అంటూ పిలుపునిస్తున్నారు.

Also Read: తన పాపాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయా అనే టెన్షన్ లో మోనిత.. కార్తీక్ మార్పు నాటకం అనుకుంటున్న ఫ్యామిలీ

చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ మరో బృహత్కార్యానికి శ్రీకారం.. రేపటి నుంచి సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్