Karthika Deepam: తన పాపాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయా అనే టెన్షన్ లో మోనిత.. కార్తీక్ మార్పు నాటకం అనుకుంటున్న ఫ్యామిలీ

సౌందర్య ఇంట్లో కార్తీక్‌ని.. భాగ్యం ఇంటికి తీసుకుని వెల్లేందుకు ఆలోచిస్తుంటారు.. హిమ, శౌర్యలు డాడీ రాకుండా మేము వెళ్లం’ అంటారు.. పీటలమీ

Karthika Deepam: తన పాపాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయా అనే టెన్షన్ లో మోనిత.. కార్తీక్ మార్పు నాటకం అనుకుంటున్న ఫ్యామిలీ
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2021 | 8:37 AM

Karthika Deepam Serial: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1019వ ఎపిసోడ్ లో అడుగుపెట్టింది. ఈరోజు ఎపిసోడ్.. హైలెట్స్ ఏమిటో చూద్దాం..

సౌందర్య ఇంట్లో కార్తీక్‌ని.. భాగ్యం ఇంటికి తీసుకుని వెల్లేందుకు ఆలోచిస్తుంటారు.. హిమ, శౌర్యలు డాడీ రాకుండా మేము వెళ్లం’ అంటారు.. పీటలమీద జంటగా కూర్చుంటే బాగుంటుందని అందరూ ఆలోచిస్తుంటే.. కార్తీక్ ఇంటికి వస్తాడు. దీప నేనే వంట చేశాను అంటే.. మనం మాలతి ఎందుకు జీతం ఇస్తున్నాం మమ్మి.. ఇకనుంచి మాలతి వంటచేయాలి.. ఇంకెవరూ వెళ్ళడానికి వీల్లేదు అంటూ మండిపడతాడు. దీంతో సౌందర్య.. కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నావు.. దానిని ఏడిపించడమే పనిగా పెట్టుకున్నావా అంటూ ప్రశ్నిస్తుంది. రేపు మనం భాగ్యం ఇంటికి వెళ్తున్నాం.. దీప అందరూ ఈరోజు వెళ్తాడు. అంటే సారీ మమ్మి అంటూ దీంతో అసహనంతో అక్కడ నుంచి కార్తీక్ తన గదిలోకి వెళ్ళిపోతాడు

సరుకులు తెచ్చిన మురళీ కృష్ణతో .. ఆ సరుకులన్నీ తీసుకుని వెళ్లి.. ఏ గుడిలోనో ఇచ్చేసి రా అంటుంది. నీ పెద్ద అల్లుడు మారడు.. అసలు నీ కూతురు ఎలా భరిస్తుంది అని అంటుంది భాగ్యం నాకూతురు తలరాత మారదు అంటూ మురళీకృష్ణ కన్నీరు పెట్టుకుంటాడు. మరోవైపు మోనిత.. డ్రగ్ ఇంజెక్ట్ చేసిన విషయం ఇన్నేళ్ల తర్వాత బయటపడబోతుంది.. ఒకొక్కటిగా తనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయా.. కార్తీక్ దీప ఒక్కటి అవుతారా.. తన బతుకులో మిగిలేది మట్టే .. ఎం జరుగుతుంది అని ఆలోచిస్తుంది. దీప పగతో విష ప్రయోగం చేసి ఉంటుందా.. అని ఆలోచిస్తూ.. దీప నాలాంటిది కాదు.. నీరసం అని అనుకుంటుంది. ప్రియమణి ఎన్నడూ లేనిది ఇన్ని మందులు వేసుకుంటున్నారు ఏమిటి అని అంటూనే.. నీ పాపాలు పండి ఎదో మాయరోగం వచ్చినట్లుంది అనుకుంది ప్రియమణి

కార్తీక్ దగ్గరకు పిల్లలు వచ్చి భోజనం చేద్దామని పిలుస్తారు.. ఆకలి లేదు తర్వాత తింటా అంటాడు.. దీప కార్తీక్ తో కోటీశ్వరుడి ఇంటికి నిరుపేద చుట్టం వస్తే ఎలా ఉంటుందో.. నా పరిస్థితి అలానే ఉంది. నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి తాత్కాలిక భర్తగా నటించారని నా మనసుకు అర్ధమయ్యింది. ఇంకా ఎన్నిసార్లు మోసపోయారు డాక్టర్ బాబు.. నా ఉనికే మీకు నచ్చడం లేదని పిల్లకి కూడా అర్ధమయ్యింది. మీరు ఎవరు మాటలు విని ఇలా తయారవుతున్నారా తెలుస్తుంది. నేనే వెళ్ళిపోతాను డాక్టర్ బాబు.. ఎక్కడికో మీ కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోతాను అంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.. పిల్లల్ని పిచ్చివాళ్లను చేయకు.. టాబ్లెట్స్ సరిగ్గా వేసుకో అంటూ భోజనం చేస్తాడు కార్తీక్..

ఇంకా పుట్టింటికి వేళ్ళని శ్రావ్యని ఎందుకు వెళ్ళలేదు అంటే.. బావగారు వద్దంటున్నారు కదా వెళ్లాలనిపించలేదు అంటూ.. మా అక్క ఈ ఇంట్లో క్షేమంగా ఉండగలదు కానీ.. సంతోషంగా ఉండలేదు.. ఆయన పూటకో రకంగా ఉంటున్నారు.. అంటుంటే.. ఇంటి కోడళ్ళు బాధపడితే ఇంటికి మంచిది కాదు.. నేను అన్ని చక్కదిద్దుకుంటాను అంటుంది సొందర్య.. మీ ఇంటికి వెళ్ళండి అని పంపిస్తుంది. మాకు ఇక్కడ బాగోలేదు.. శ్రీరామ్ నగర్ బస్తీలోనే బాగుంది.. అసలు సంతోషంగా లేదు.. నాన్నకు కలిస్తే బాగుంటుంది అనుకున్నాం.. కానీ ఇలా ఉందేమిటి అమ్మా అందరం కలిసి ఒకే గదిలో ఉంటాం అనుకున్నాం.. నువ్వేమో ఒక గదిలో మేము డాడీ గదిలో.. మాకు ఎం బాగోలేదు.. అందరం కలిసి అమ్మా దీప తాతయ్య ఇంటికి వెళ్తే బాగుండును కదమ్మా.. అన్నారు శౌర్య, హిమలు నేను అంటే ఇష్టం లేకపోయినా మీ డాడీకి మీరంటే ఇష్టమే కదా అంటుంది.. నువ్వు నాన్న వస్తేనే మేము తాతయ్య ఇంటికి వెళ్తాము..

సౌందర్య, ఆనందరావు లు కార్తీక్ కోసం ఎదురు చూస్తుంటారు.. ఇంతలో దీప అక్కడికి వస్తే.. కార్తీక్ ఇంకా రాలేదు నీకు ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది.. ఆయనకు గోడలతోనూ వస్తువుల తోనూ చెప్పే అలవాటు లేదు కదా అత్తయ్య అంటుంది దీప

Also Read: రామాయణంలో సుందరకాండ విశిష్టత… శ్రీరామ నవమిరోజున పఠిస్తే ఫలితం ఏమిటంటే..!

టీడీపీకి నారాలోకేష్ అనే వైరస్ పట్టిందన్న ఆర్జీవీ.. దాని నివారణకు ఏకైక టీకా ఇదేనంటూ ట్వీట్