Oxygen Leaks : హాస్పిటల్‌లో ఘోర ప్రమాదం.. భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..22 మంది రోగుల మృతి
Oxygen Tank Leaks at Zakir Hussain Hospital : మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో దురదృష్టవశాత్తూ ఆక్సిజన్ ట్యాంక్ లీక్ అయింది. .
Oxygen Tank Leaks at Zakir Hussain Hospital : మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దురదృష్టవశాత్తూ ఆక్సిజన్ ట్యాంక్ లీక్ అయింది. దీంతో రోగులకు ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో ఏకంగా 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఆసుపత్రి వెలుపల ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒక ట్యాంక్ నుంచి భారీగా ఆక్సిజన్ లీక్ కావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆక్సిజన్ ట్యాంక్ నుంచి పెద్ద ఎత్తున లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా తెల్లని గ్యాస్ వ్యాపించింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన ఘటనా ప్రాంతానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు. నిపుణులు గ్యాస్ అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆస్పత్రి అంతా భీతావహవాతావరణం నెలకొంది. మరికాసేపట్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలాఉండగా, దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. పేరు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఆక్సిజన్ లేదంటూ చేతులెత్తేశాయి. ఈ పరిస్థితిపై నిన్న ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రోగులకు ప్రాణాధారమైన ఆక్సిజన్ తగినంతగా లభ్యమేయ్యేలా చూసేందుకు పరిశ్రమలు తమ ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకోవాలని సూచించారు. అన్ని కోవిడ్ ఆసుపత్రులు దీని లభ్యతకు తగిన ప్రయత్నాలు చేయాలన్నారు.
ఈ సందర్భంలో ప్రధాని పిలుపు మేరకు ప్రధానంగా టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. లిక్విడ్ ఆక్సిజన్ ని ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు 24 క్రయోజెనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటామంటూ ట్విటర్ ముఖంగా ఆ సంస్థ చేసిన ప్రకటనను మోదీ స్వాగతించారు. ఇది టాటా గ్రూప్ సౌహార్ద్ర చర్య అని ఆయన అభివర్ణించారు. వివిధ ధార్మిక కార్యక్రమాల ద్వారా టాటా గ్రూప్ ట్రస్ట్ ప్రజలకు సేవలందిస్తున్నదని, ఇందుకు కృతజ్ఞతలని మోదీ ట్వీట్ చేశారు.
కాగా, గత ఏడాది కూడా కరోనా నివారణా చర్యలకు టాటా గ్రూప్ రూ. 1500 కోట్లను కేటాయించింది. వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు తదితరాలను దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు సరఫరా చేసింది. ఆరు వారాల్లో కేరళలో ప్రత్యేకంగా ఆసుపత్రిని నిర్మించింది టాటా గ్రూప్. నాటి టాటా ధార్మిక చర్యలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Zakir Hussain Hospital Read also : NASA’s Ingenuity : మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్‌గా అమెరికా (నాసా) రూపొందించిన ఇన్‌జెన్యూటీ రికార్డు