అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను పరిశీలించేందుకు పంపిన పర్సెవరెన్స్ రోవర్‌తో పాటే నాసా ఈ మినీయేచర్ హెలికాఫ్టర్‌ను మార్స్ మీదకు పంపింది. ఇన్‌జెన్యూటీ ఫిబ్రవరి 18న రోవర్ నుంచి విడిపోయి మార్స్‌పై అడుగుపెట్టింది. ఇవాళ ఇన్‌జెన్యూటీ అంగారకుడిపై ఎగిరే దృశ్యాలను పెర్సెవరాన్స్ చిత్రీకరించి భూమికి చేరవేసింది.