AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడతారా ? అసలు విషయం చెప్పిన భారత్ బయోటెక్ చైర్మన్.. 

covid vaccine: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. టీకా వచ్చిందని ఊపిరి పీల్చుకునే సమయానికి.. నేను ఇంకా ఉన్నానని రుజువు చేస్తూ..

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడతారా ? అసలు విషయం చెప్పిన భారత్ బయోటెక్ చైర్మన్.. 
4
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2021 | 12:51 PM

Share

Covid vaccine:దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. టీకా వచ్చిందని ఊపిరి పీల్చుకునే సమయానికి.. నేను ఇంకా ఉన్నానని రుజువు చేస్తూ.. రోజూకు వేల మందిని బలితీసుకుంటుంది కరోనా. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారికి  కూడా మళ్లీ కరోనా సోకడంతో.. టీకాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా స్పందించారు. ప్రస్తుతం వేస్తున్న టీకాను కరోనా నుంచి ఉపిరితిత్తులను రక్షిస్తాయని.. అలాగే లోపలి శరీర భాగాలను కరోనా భారిన పడకుండా చేస్తాయని తెలిపారు. టీకా రెండు డోసులు పొందిన  తర్వాత కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కచ్చితంగా మాస్క్ దరించాల్సిందేనని తెలిపారు. అన్ని రకాల టీకాలు ఇదే విధంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ వ్యాక్సిన్ అనేది కరోనా శరీరంలో మరింత తీవ్రతరం కాకుండా చేస్తుందని తెలిపారు. అలాగే వ్యాక్సిన్ అనేది ప్రాణాంతకం కాదన్నారు.  (Bharath biotech chairman)

కరోనా సెకండ్ వేవ్ దేశానికి మరింత ప్రమాదకరమని నిరూపిస్తుందని.. ప్రతి రోజూ దేశంలో ఈ వ్యాధి వలన మరణాల సంఖ్య మరింత ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. అలాగే మహారాష్ట్ర, అస్సాం, యూపీ రాష్ట్రాలు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ వ్యాక్సిన్స్ దిగుమతులు చేసుకోవడానికి  ఆసక్తి కనబరుస్తాయన్నారు.

ఇక మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ మే లో 30 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని..  దీని సామర్థ్యాన్ని ఏప్రిల్‌లో 20 మిలియన్ మోతాదుల నుండి మరియు మార్చిలో 15 మిలియన్ల నుండి గణనీయంగా పెంచుతుందన్నారు. భారత్ బయోటెక్  సంవత్సరానికి 700 మిలియన్ మోతాదుల కోవాక్సిన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కంపెనీ పెంచుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడమనేది ప్రస్తుతం పరిస్థితులకు అవసరమని. భారతదేశ వ్యాక్సిన్ తయారీదారులు ఇప్పుడు రాష్ట్రాల వ్యక్తిగత డిమాండ్‌ను తీర్చాల్సి ఉంటుంది, మే 1 నుండి ప్రారంభమయ్యే టీకాల మూడవ దశలో, రాష్ట్రాలు వ్యాక్సిన్ నుండి వ్యాక్సిన్ కొనుగోలు చేయగలవు. అస్సాం ఇప్పటికే భారత్ బయోటెక్ నుంచి 1 కోట్ల కోవాగ్జిన్ మోతాదులకు ఆర్డర్ ఇచ్చిందన్నారు. (bharat biotech )