India Carona Cases: డేంజర్‌జోన్‌లో భారత్.. నిమిషానికి 200 పాజిటివ్ కేసులు..అంతకంతకు పెరగుతున్న మరణాల సంఖ్య..!
ఫస్ట్ వేవ్‌లో భయపడిందంతా సెకండ్‌వేవ్‌లో జరుగుతోంది. ఫస్ట్‌వేవ్‌లో భేష్ అనిపించుకున్న భారత్.. సెకండ్‌వేవ్‌లో ప్రపంచాన్ని భయపెడుతోంది.
ఫస్ట్ వేవ్‌లో భయపడిందంతా సెకండ్‌వేవ్‌లో జరుగుతోంది. ఫస్ట్‌వేవ్‌లో భేష్ అనిపించుకున్న భారత్.. సెకండ్‌వేవ్‌లో ప్రపంచాన్ని భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రెండు లక్షల 95వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు మూడు లక్షల కేసులు అని చెప్పుకోవచ్చు. ఈ లెక్కన గంటకు మనదేశంలో 12,291 కేసులు నమోదు అయ్యాయి. అంటే నిమిషానికి 200 కేసులు అన్నమాట.
దేశంలో గత ఏడాది లక్ష కేసులు నమోదు అయిన తర్వాత కరోనా పీక్స్‌కి చేరింది. అక్కడినుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈసారి మాత్రం లక్ష కేసలు ఏనాడో దాటిపోయాయి. రెండు లక్షలకుపైబడి కేసులు రావడం వరుసగా ఇది 17వ రోజు కావడం విశేషం. కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో అమెరికా ఉంటే, మూడోస్థానంలో బ్రెజిల్ ఉంది.
కరోనా మహమ్మారి ఎంత డేంజర్‌గా ఉందో కేసుల్లోనే కాదు.. మరణాల్లోనూ ప్రతిఫలిస్తోంది. గత 24 గంంటల్లో 2,023 మంది కరోనా కాటుకు ప్రాణాలొదిలారు. దేశంలో ఇప్పటివరకు కరోనా వ్యాధితో లక్షా 82వేల 553 మంది చనిపోయారు.
ఫస్ట్‌వేవ్‌లోగానే సెకండ్‌వేవ్‌లో కూడా కరోనాతో మహారాష్ట్ర తీవ్రంగా అల్లాడుతోంది. నిన్న ఒక్కరోజులోనే మహారాష్ట్రలో 62,097 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే మొత్తం కేసులు 39.60 లక్షలకు చేరాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 519 మంది బాధితులు చనిపోయారు. కరోనా కేసుల్లో మహారాష్ట్ర తర్వాత కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి.
అయితే, కరోనా కేసులు పెరుగుతున్నా, రికవరీ రేటు కూడా పెరుగుతోందని ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది కరోనా పీక్ అవుట్ అయిన సందర్భంలో రికవరీ రేటు 83.33 శాతం ఉండగా, ఈ నెలలో ఈ రోజు వరకు రికవరీ రేటు 85.01 శాతంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది.
కరోనా సెకండ్‌వేవ్‌ను అరికట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఫస్ట్‌వేవ్‌కు సెకండ్‌వేవ్‌కు 8 నుంచి 9 నెలల సమయం ఉన్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సెకండ్ వేవ్ వస్తుందని సెరో సర్వేలు చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు.
Read Also… మే 1 నుంచి ఉచితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్, 18 ఏళ్ళు పైబడినవారికి కూడా, యోగి ఆదిత్యనాథ్