LIC: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు… కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు
LIC Premium Revenue: దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) రికార్డు స్థాయి కొత్త ప్రీమియం...
LIC Premium Revenue: దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) రికార్డు స్థాయి కొత్త ప్రీమియం వసూళ్లను రాబట్టింది. గణాంకాల ప్రకారం.. మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ సంస్థ కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1.84 లక్షల కోట్లుగా నమోదైంది. ఇందులో వ్యక్తిగత పాలసీదారులు చెల్లించిన మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.56,406 కోట్లుగా ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చినట్లయితే ఇది 10.11 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎల్‌ఐసీ 2.10 కోట్ల పాలసీలు విక్రయించింది. ఇందులో 46.72 లక్షల పాలసీలు ఒక్క మార్చి నెలలోనే విక్రయించింది. మార్కెట్ వాటాపరంగా చూస్తే ఎల్‌ఐసీ ఈ ఏడాది మార్చి నెలలో 81.04 శౄతం, 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం 74.58 శాతం మార్కెట్ వాటా సాధించింది. ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ అధికంగా ఉన్న ఎల్‌ఐసీ మార్కెట్లో తన దూకుడు కొనసాగిస్తుండటం విశేషం. కాగా, కరోనా నేపథ్యంలో ఎల్‌ఐసీల పాలసీల సంఖ్య పెరిగిపోయాయి. ఒకప్పుడు పాలసీలు అంటే పెద్దగా పట్టించుకోని వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది.
3,45,469 ఏజెంట్ల ఉన్న ఎల్‌ఐసీ… ఇప్పుడు13,53,808 ఏజంట్లను కలిగి ఉంది. అయితే ఎల్‌ఐసీ రోజురోజుకు కొత్త కొత్త పాలసీలను తీసుకువస్తుండటంతో కస్టమర్ల మరింతగా పెరిగిపోతున్నారు. ఇప్పటికే రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇవీ చదవండి: Amazon, Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన.. డెలివరీల నిలిపివేత