కరోనాలోనూ దేశంలో బంగారం దిగుమతుల జోరు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పసిడి ఎంత దిగుమతి అయ్యిందో తెలిస్తే…

Gold Imports: దేశంలో బంగారం ఉన్న డిమాండ్‌ దేనికుండదు. బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగుల చేసే మాత్రం ఆగదు. ముఖ్యంగా భారతీయులు బంగారానికి అధిక ప్రాధాన్యత...

కరోనాలోనూ దేశంలో బంగారం దిగుమతుల జోరు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పసిడి ఎంత దిగుమతి అయ్యిందో తెలిస్తే...
Gold Imports
Follow us
Subhash Goud

|

Updated on: Apr 21, 2021 | 2:48 PM

Gold Imports: దేశంలో బంగారం ఉన్న డిమాండ్‌ దేనికుండదు. బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగుల చేసే మాత్రం ఆగదు. ముఖ్యంగా భారతీయులు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక దేశంలో బంగారానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. పసిడికి డిమాండ్‌ పెరుగడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 22.58 శాతం పెరిగి 346 కోట్ల డాలర్లుగా (రూ.2.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇదే ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు మాత్రం 71 శాతం క్షీణించి 79.1 కోట్ల డాలర్లకు దిగివచ్చాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే వజ్రాలు, అభరణాల ఎగుమతులు మాత్రం 27.5 శాతం క్షీణించి 2600 కోట్ల డాలర్లకు పడిపోయాయి. 2019-20లో వెండి దిగుమతుల విలువ 2823 కోట్ల డాలర్లు (రూ.2 లక్షల కోట్లు). బంగారం దిగుమతులు పెరిగినా గత ఏడాది వాణిజ్య లోటు 9856 కోట్ల డాలర్లు ఉంది. బంగారం డిమాండ్‌ దేశంలో పెరిగిందని, రాబోయే అక్షయ తృతీయ, వివాహాల సీజన్‌ సమయంలో మరింత పెరగే అవకాశాలున్నాయని వజ్రాలు, అభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి చైర్మన్‌ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద బంగారం దిగుమతి దేశం భారత్‌. ప్రతియేటా సగటున 800-900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. గతంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టినా… ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వేగంగా పెరుగుతోంది. అయితే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా..? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు దేశంలో కరోనా వ్యాప్తి కారణమనే చెబుతున్నారు. గత రెండు నెలలుగా స్టాక్‌ మార్కెట్లు పెద్దగా ప్రయోజనం కలిగించడం లేదు. పెట్టుబడులను వేరే వాటిపైన మళ్లించాలని చూస్తున్నారు. కొంత మంది బిట్‌కాయిన్‌, డాలర్‌ కరెన్సీ వైపు మళ్లిస్తున్నారు. ఇప్పుడు వారికి బంగారంపై నిఘా ఉంది. క్రమ క్రమంగా పసిడి ధరలు పెరుగుతుంటే దానిపై పెట్టుబడి పెడుతున్నారు. తద్వారా త్వరలోనే మంచి రిటర్న్స్ వస్తాయనే అంచనాతో ఉన్నారు. అందుకే ఏప్రిల్‌ 1 నుంచి బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. దేశంలో కరోనా తగ్గే వరకూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక బంగారంతో పాటు భారతీయ సంప్రదయంలో బంగారానికి, వెండికి ప్రాముఖ్యత ఉంది. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పసిడి, వెండి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక బంగారం, వెండి ధరను గత 6 నెలల నుంచి పరిగణలోకి తీసుకుంటే.. అప్పుడప్పుడు తగ్గుతున్నా మొత్తానికి చూస్తే వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

ఇవీ చదవండి: LIC: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు… కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు

LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం

Gold and Silver Price: కొద్దిగా తగ్గిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే