దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!

Air pollution: భారత్‌ పొల్యూట్‌ అవుతోంది. దేశంలో వాయు కాలుష్యం మృత్యుఘంటికలు మోగిస్తోంది. ప్రతి ఏటా ప్రాణ హానితో పాటు ఆర్థికపరంగా అపార నష్టాన్ని మిగుల్చుతోంది..!

దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!
Air Pollution Costs Indian Business
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 21, 2021 | 1:35 PM

Air pollution in India: భారత్‌ పొల్యూట్‌ అవుతోంది. దేశంలో వాయు కాలుష్యం మృత్యుఘంటికలు మోగిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోసహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఒక్క 2020 సంవత్సరంలోనే 1.20 లక్షల మందిని పొట్టనబెట్టుకుందని ఇటీవల గ్రీన్ పీస్ సంస్థ వెల్లడించిన నివేదికలో పేర్కొంది. కాలుష్యం కన్నీరు పెట్టిస్తోంది. ప్రాణవాయువు విషాన్ని చిమ్ముతోంది. ప్రతి ఏటా ప్రాణ హానితో పాటు ఆర్థికపరంగా అపార నష్టాన్ని మిగుల్చుతోంది..!

ఎయిర్‌ పొల్యూషన్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ఆర్థిక రంగాన్ని కుదేలుచేస్తోంది. లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొడుతోంది. ఎయిర్‌ పొల్యూషన్‌ ఏంటి..? లక్షల కోట్లను దిగమింగేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు వింటున్నది నిజమే. ఇటీవలి ఓ సర్వే దిమ్మదిరిగే వివరాల్ని బయటపెట్టింది. ఎయిర్‌ పొల్యూషన్‌ దేశ ఆర్థిక రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో విడమర్చి చెప్పింది.

అక్షరాలా 7 లక్షల కోట్లు.. ఇదేదో దేశ బడ్జెట్‌ సంఖ్య కాదు సుమా..! ఏటా ఎయిర్‌ పొల్యూషన్‌ మిగుల్చుతున్న నష్టమిది. వాయు కాలుష్యం వల్ల జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 95 బిలియన్‌ డాలర్లు.. మన మాటలో చెప్పాలంటే 7 లక్షల కోట్లు ఆవిరవుతోంది. ఈ సంఖ్య దేశ జీడీపీలో 3 శాతంతో సమానం. ఇటీవలి సర్వే రిపోర్టు చెప్పిన సత్యమిది..!

ఎయిర్‌ పొల్యూషన్‌ వల్ల కలుగుతున్న నష్టం విలువ వార్షిక పన్ను వసూళ్లలో 50 శాతంగా ఉంటోంది. ఈ నష్టాన్ని దేశ ఆరోగ్య రంగ బడ్జెట్‌తో పోల్చితే 150 శాతంతో సమానం. ఎయిర్‌ పొల్యూషన్‌ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఆరోగ్య రంగాన్ని ధ్వంసం చేస్తోందని సదరు సర్వే వెల్లడించింది.

ఎయిర్‌ పొల్యూషన్‌ సృష్టిస్తున్న సునామి అంతా ఇంతా కాదు. వాయు కాలుష్యం కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల 1.3 బిలియన్‌ కార్మిక పనిదినాలపై ఎఫెక్ట్‌ పడుతోంది. ఫలితంగా 6 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు.. ఈ ఎయిర్‌ పొల్యూషన్‌ కార్మికుల పనిపై గణనీయ ప్రభావం చూపుతోంది. పని జిజ్ఞాస తగ్గడంతో పాటు ఫిజికల్‌ పర్ఫామన్స్‌లో మార్పునకు కారణమవుతోంది. దీనివల్ల తగ్గుతున్న ఉత్పత్తి విలువ 24 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టింది సర్వే. గాలి నాణ్యత పడిపోతుండడం వల్ల జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. ఈ పరిణామం సైతం 22 బిలియన్ల మేర రెవెన్యూ లోటుకు కారణమవుతోంది.

ఈ ఎయిర్‌ పొల్యూషన్‌ ఒక్క ఆర్థిక రంగంపైనే కాదు.. మనిషి మరణాలకూ దారితీస్తోంది. గాలి కాలుష్యం వల్ల 2019లో ఒక్క ఇండియాలోనే 1.7 మిలియన్ల మేర అకాల మరణాలు సంభవించాయి. ఈ లెక్క దేశంలోని మొత్తం మరణాల్లో 18 శాతంతో సమానం. 2030 నాటికి ఈ సంఖ్య మరింత పెరగనుందని సర్వే రిపోర్టు అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం ఫలితంగా చోటు చేసుకుంటున్న మరణాలు.. దెబ్బతింటున్న ఆర్థిక రంగంలో అత్యధికంగా నష్టపోతున్నది భారత్‌ మాత్రమేనని చెప్పింది.

దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఎయిర్‌ పొల్యూషన్‌లో ప్రపంచ దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. ప్రపంచంలోని 30 కాలుష్య నగరాల్లో 21 నగరాలు మన దేశానికి చెందినవే కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు, ప్రజారోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాలను (ఈవీ) వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. కిందటి నెలలో ‘గో ఎలెక్ట్రిక్‌’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

ఓవైపు భారత్‌ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. 2025 కల్లా ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో వాయు కాలుష్యం భవిష్యత్‌ లక్ష్యాలకు ప్రతిబంధకంగా మారే ప్రమాదముంది. కర్బన ఉద్గారాలు, ఎయిర్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాల్సిన అవసరముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాయు కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రత్యేక విధానాల ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో సహా 14రాష్ట్రాలు ఈవీ విధానాలను ప్రకటించాయి. ఈవీల తయారీ, ఛార్జింగ్‌ సదుపాయాల రంగంలో 2030 నాటికి నాలుగు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని ‘తెలంగాణ ఈవీ, ఇంధన నిల్వ విధానం 2020-30’ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలో అమ్ముడై రిజిస్ట్రేషన్‌ జరుపుకొనే మొదటి రెండు లక్షల విద్యుత్తు ద్విచక్ర, 20 వేల త్రిచక్ర వాహనాలు, అయిదు వేల ట్యాక్సీలు, టూరిస్టు క్యాబ్‌లు, పది వేల త్రిచక్ర సరకు వాహనాలు, అయిదు వేల కార్లు, అయిదు వందల బస్సులకు రహదారి సుంకం, రిజిస్ట్రేషన్‌ రుసుములనూ పూర్తిగా మినహాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ ఈవీల రంగంలో 2030నాటికి రూ.30వేల కోట్ల పెట్టుబడులు సమీకరించాలనుకుంటోంది. ఆర్టీసీ బస్సులను 2029 నాటికి పూర్తి ఈవీలుగా మార్చుతామని ఏపీ ఈవీ విధానం- 2018 ప్రకటించింది. నిరుడు డిసెంబరులో నీతిఆయోగ్‌ నిర్వహించిన సమావేశంలోనూ ఆంధ్ర అధికారులు దీన్ని పునరుద్ఘాటించారు.

సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఈవీలు ప్రియమైనవి. వీటి నిర్వహణ వ్యయం తక్కువ, పర్యావరణహితకరమైనవి. కొనుగోలు ధర ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలు అక్కరకొస్తున్నాయి. ఛార్జింగ్‌ కేంద్రాలు ఎక్కువగా లేకపోవడంతో ఈవీల పట్ల ఆసక్తి ఉన్నవారూ కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు. ఈ-వాహనాల ఛార్జింగ్‌ కోసం విద్యుత్తు అమ్మకాన్ని ‘సేవ’ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే విద్యుత్తు వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయి. వాయు కాలుష్యాన్ని కొంతలో కొంతైన తగ్గించివాళ్లమవుతాం. భవిష్యత్ మానవాళి మనుగడకు మేలు చేసిన వాళ్లమవుతామని నిపుణులు చెబుతున్నారు.

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌