జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!

Phani CH

|

Updated on: Nov 05, 2024 | 6:48 PM

సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ.. అని ఓ కవి అంటే.. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నాడు ఓ సినీ కవి. స్నేహానికి కుల,మత,జాతి భేదాలుండవు. అది మనుషులకే కాదు.. మూగజీవులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. కోతి, కుక్క.. రెండిటికీ అస్సలు పడదు.. కానీ అవి జాతివైరాన్ని మరిచి మంచి మిత్రులుగా మారి ఎలా ఆడుకుంటున్నాయో మీరే చూడండి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట లోని గెస్ట్ హౌస్ బజారులో,కుక్క -కోతి ఎంతో స్నేహంగా ఉంటూ,సరదాగా ఆడుకొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. కుక్క కోతి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే.. కోతి కుక్క శరీరంలోని పేలు తీస్తూ ఎంతో స్నేహంగా ఉన్నాయి. అదికూడా నడిరోడ్డుమీద.. అందరూ జనాలు తిరుగుతుండగానే ప్రపంచాన్ని మర్చిపోయి ఆ రెండు మూగజీవులూ ఎంత స్నేహంగా ఉన్నాయో.. ఎంత సరదాగా ఆడుకుంటున్నాయో చూస్తే ఇది కదా స్నేహమంటే అనిపించక మానదు. అశ్వారావుపేట పట్టణంలో గత కొద్ది నెలలుగా కోతుల గుంపు సంచరిస్తోంది. ఈ కోతుల గుంపు పట్టణమంతా తిరిగి మధ్యాహ్నం గెస్ట్ హౌస్ బజారుకు చేరుతుంది. ఈ సమూహంలోని ఒక కోతికి ఇక్కడ ఉంటున్న కుక్కతో స్నేహం ఏర్పడింది. ఈ కుక్క ఆ కోతి వచ్చే సమయానికి అక్కడకు చేరుకుంటుంది. ఇక రెండు కలిసి చేసే హడావుడి మాములుగా ఉండదు, రెండూ కలిసి దాగుడు మూతలు ఆడుకుంటాయి. కోతి కుక్కకి చక్కగా పేలు చూస్తుంది. ఇక కోతి చేష్టలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఈ రెండిటి స్నేహాన్ని చూసి ముచ్చటపడిన మరో శునకం కూడా వీటికి జత కలిసింది. ఇక ఆ మూడు జంతువులూ స్థానికంగా సందడి చేస్తున్నాయి. వీటి స్నేహానికి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ మూగజీవులు మనుషులకు స్పూర్తిగా నిలుస్తున్నాయని అంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్

బాబోయ్ !! బ్లాస్టింగ్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ

యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??