హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Phani CH

|

Updated on: Nov 05, 2024 | 6:49 PM

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎంతో కీలకమైన ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరణకు మోక్షం కలిగింది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ –విజయవాడ హైవేపై నిత్యం రక్తసిక్తమవుతోంది. ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు హైవేను ఆరు లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు జాతీయ రహదారి నెంబర్ 65 కీలకమైనది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ ఉన్న 181.50 కిలోమీటర్లు ఉంది. ఈ హైవేను ఆరు లైన్లుగా విస్తరించేందుకు 2010లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జీఎమ్మార్ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును 1740 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించింది. ఆ సమయంలోనే ఆరు లేన్ల రహదారి కోసం భూసేకరణ చేశారు. 2012లో జీఎమ్మార్.. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేస్తోంది. ఇలా 2025 జూన్ వరకూ టోల్ వసూలు చేసుకునేందుకు జీఎమ్మార్ కు గడువు ఉంది. నిత్యం ప్రమాదాలతో ఈ హైవే రక్తసిక్తంగా మారుతుండడంతో ఆరు లైన్లుగా విస్తరించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ హైవేని ఎట్టకేలకు ఆరులేన్ల రహదారిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రెండు సంవత్సరాల్లో ఈ హైవే ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనులను పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదిగా వెళుతున్న NH65ను ఆరు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని ఒప్పించి ఆరు లైన్ల విస్తరణకు నిధులు కేటాయించేలా చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్ !! బ్లాస్టింగ్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ

యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??

Published on: Nov 05, 2024 06:46 PM