AP News: వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..

ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటికి, ఇంటిలో ఉన్న పుట్టకు చాలా విశిష్టత ఉంది. మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ పుట్ట ఉన్న ఈ ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. అయితే అదే ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట ఓ చిన్న పుట్ట ఏర్పడిందట.

AP News: వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..
Ap News
Follow us
S Srinivasa Rao

| Edited By: Ravi Kiran

Updated on: Nov 05, 2024 | 9:06 PM

కార్తీక మాసంలో వచ్చే హిందువుల ముఖ్యమైన పoడగలలో నాగుల చవితి ఒకటి. ప్రతియేటా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితి పండుగను జరుపుకుంటారు.నాగుల చవితి రోజున హిందువులు నాగు పామును నాగ రాజుగా, నాగ దేవతగా పూజించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.భారత సనాతన సంప్రదాయంగా వస్తున్న విశ్వాసాన్ని అనుసరించి సమస్త జీవకోటిలో ఈశ్వరుడు ఉన్నాడని, ప్రకృతి ఆరాధనలో భాగంగానే సర్పాలను కూడా పూజించడం సాంప్రదాయంగా వస్తోంది. అంతే కాదు ప్రకృతి సమతుల్యతలో పాములు కూడా విశేష పాత్ర పోషిస్తాయి అనటంలో కూడా సందేహo లేదు. అయితే పాములు జనావాసాలకు దూరంగా గ్రామ,పట్టణ శివారులలో నిర్మానుష్య ప్రాంతాలలో పుట్టల్లో ఆవాసం ఉంటాయి.కానీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో జనావాసాల మధ్య ఆవాసం ఉంటుంది ఓ సర్ప రాజు. ఓ ఇంటిలోనే భారీ పుట్టను ఏర్పాటు చేసుకొని అందులో ఆవాసం ఉంటూ స్థానికుల చేత పూజలందుకుంటోంది.

ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

మొదట్లో పుట్టను తొలగించి అనేక సమస్యలు ఎదుర్కొన్న కుటుంబం..

ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటికి, ఇంటిలో ఉన్న పుట్టకు చాలా విశిష్టత ఉంది. మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ పుట్ట ఉన్న ఈ ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. అయితే అదే ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట ఓ చిన్న పుట్ట ఏర్పడిందట. ఇంట్లో పుట్టలు ఉండటమేoటని రామారావు తల్లి మొదట ఆ పుట్టను రెండు మూడు సందర్భాలలో తొలగించేసారట. ఆ సందర్భంలో రామారావు తల్లి ఆరోగ్యం పాలవ్వటం, కుటుంబ సభ్యులు ఆర్థికంగా పలు ఇబ్బందులు పడటం వంటివి జరుగుతూ వచ్చాయట. దాంతో పండితులను సంప్రదించి తమ కుటుంబ పరిస్థితులు తెలియజేసారట…అదే సందర్భంలో ఇంట్లో పదేపదే వెలుస్తోన్న పుట్ట గురించి కూడా తెలియజేసారట. అది విన్న పండితులు మళ్ళీ ఈసారి ఇంట్లో పుట్ట వెలిస్తే దానిని తొలగించవద్దని అది దేవుని అనుగ్రహం అని తెలిపారట. దాంతో తరువాత మళ్ళీ పుట్ట వెలిసినా దానిని తొలగించలేదు సరికదా పూజించటం చేసారట.

ఇవి కూడా చదవండి

కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా నాగ దేవత..

తరచూ పుట్టలోకి నాగు పాము కూడా వచ్చి పోతుండేదట. సర్పరాజు ఇంట్లో సంచరించిన ఎవరిని ఏమి అనేది కాదట.ఇక ఆ తరువాత నుండి ఆ ఇంట్లో ఉంటున్న కుటుంభంలోని వారందరి ఆరోగ్యాలు బాగుండటమే కాదు రామారావు, అతని సోదరులు, పిల్లలు ఆర్థికంగాను ఎదుగుతూ వచ్చారట. కొన్నాళ్ళకు ఇంట్లో పాము తిరుగుతుండటంతో ఆ ఇంటిని గుడిగా భావించి పొరుగునే మరో గృహాన్ని నిర్మిoచుకునీ నివాసం ఉంటున్నారట. కుటుంభంలో కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి.ఒక్క రామారావు కుటుంబమే కాదు నాగ దేవతగా క్రమేపీ అందరి చేత కొంగు బంగారoగా పూజలందుకుంటోంది ఈ సర్ప రాజం. ముప్పై ఏళ్లు పైబడిన ఇప్పటికీ పాము పుట్టలోకి వచ్చి పోతూ ఉంటుందనీ అప్పుడప్పు పామును తాము చూస్తూ ఉంటామని ఎవరికి ఏమి అనదని స్థానికులు చెబుతున్నారు. సంతానం లేనివారు పూజ చేసి చక్కని పిల్లల్ని పొందారని అంటున్నారు స్థానికులు.

పుట్టపై శిల్పులు చెక్కినట్టు వివిధ దేవతా మూర్తుల నమూనాలు..

ఇక్కడ పుట్ట ఏయేటికాయేడు కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉండటం ఒక విషేషం. మొక్క చిగుళ్ళు తొడిగినట్టుగా ప్రతి ఏటా పుట్టలోని ఏదో ఒక మూల పెరుగుతు ఉంటుందని అంటున్నారు స్థానికులు.పైగా అదికూడా కార్తీక మాసంలోనే జరుగుతుందట. ఇలా పెరిగే మొదట రెండు అడుగుల ఎత్తులో ఉండే పుట్ట ఇపుడు ఏకంగా ఇంటి పైకప్పును తాకెంతగా ఎత్తుకు పెరిగిoదని ఆ వీధిలో వారంతా చెబుతున్నారు.పుట్టపైన దేవతా మూర్తుల స్వరూపాలు శిల్పులు చెక్కినట్లుగా దర్శనమివ్వటం ఇక్కడ మరో విశేషం. పుట్టను తదేకంగా పరిశీలిస్తే శివ లింగం, వినాయకుడు, లక్ష్మి నరసింహ స్వామి, లక్ష్మి దేవి స్వరూపాలు కనిపిస్తాయని భక్తులు చెబుతున్నారు. క్రమేపీ నాగ దేవత లీలలు ఆ నోట ఈ నోట తెలిసి ఉత్తరాంధ్ర జిల్లాలు నుండే కాకుండా బయట జిల్లాల నుండి సైతం భక్తులు క్యూ కడుతున్నారు ఈ నాగ దేవత దర్శనానికి. నాగుల చవితి రోజున భారీగా భక్తుల రద్దీ ఉంటుంది. అది కాక ప్రతి సోమవారం కూడా నాగదేవతను దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ