Ravi Kiran
01 November 2024
దూర ప్రయాణాలకు అనువైన ప్రయాణ సాధనం రైలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వేవ్యవస్థ పనిచేస్తోంది. పాసింజర్ రైళ్ల నుంచి అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ వరకూ అనేక రకాల రైళ్లు మనకున్నాయి.
మనదేశంలో నెమ్మదిగా నడిచే రైలు కూడా ఒకటి ఉంది. ఆ రైలు దాదాపు 111 స్టేషన్‌లలో ఆగుతూ 37 గంటలకు గానీ గమ్యస్థానానికి చేరుకోదు. అయినా అందులో టికెట్లకు మాత్రం భారీ డిమాండ్ ఉంటుందట.
దేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు హౌరా-అమృత్‌సర్ మెయిల్. ఇది పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్ ఐదు రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రారంభమైన తర్వాత దాని మార్గంలో ఉండే 111 స్టేషన్లలో ఆగుతుంది.
పెద్ద స్టేషన్‌లలో కాస్త ఎక్కువ సేపు ఆగే ఈ రైలు చిన్న స్టేషన్‌లలో మాత్రం ఒకట్రెండు నిమిషాలకు మించి ఆగదు. హౌరా నుంచి అమృత్‌సర్ వరకు 1,910 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఈ రైలుకు 37గంటల సమయం పడుతుంది.
టికెట్ ధరల విషయానికొస్తే, స్లీపర్ క్లాస్ రూ.695, థర్డ్ ఏసీ రూ. 1,870, రూ. సెకండ్ ఏసీ రూ.2,755, ఫస్ట్ ఏసీకి రూ.4,835గా టికెట్ ధరలు అందుబాటులో ఉన్నాయి.
ఇది హౌరా స్టేషన్ నుంచి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది.
మళ్లీ అమృత్‌సర్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 7.30 గంటలకు హౌరా స్టేషన్‌కు చేరుకుంటుంది.