- Telugu News Photo Gallery Business photos Do You Know in libya and Venezuela Petrol price is just rs 3, know the reason
Petrol Price: లీటర్ పెట్రోల్ కేవలం రూ. 3కే.. ఎక్కడో తెలిస్తే ప్రాణం చివుక్కుమంటుంది..
టైటిల్ చూడగానే తెగ మురిసిపోకండి.! స్టోరీ పూర్తయ్యేసరికి మీ ప్రాణం ఊసురుమంటుంది. ఓ చోట లీటర్ పెట్రోల్ కేవలం రూ. 3కే దొరుకుతోంది. ఇంతకీ అదేంటో తెల్సా.. అయితే పదండి చూద్దాం..
Updated on: Nov 05, 2024 | 7:32 PM

లీటర్ పెట్రోల్ కేవలం రూ. 3కే.. టైటిల్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అదేంటి మన దగ్గర లీటర్ పెట్రోల్ రూ. 107గా ఉంది కదూ.. అని అనుకుంటున్నారా.? అసలు మ్యాటర్ తెలియాలంటే ఈ స్టోరీకి వెళ్లాల్సిందే..

దేశంలోని లీటర్ పెట్రోల్ ధర చాలా రాష్ట్రాల్లో రూ. 95గా ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో రూ. 107కు చేరుకుంది. అయితే నార్త్ ఆఫ్రికాలోని లిబియా, సౌత్ అమెరికాలోని వెనిజులాలో లీటర్ పెట్రోల్ కేవలం రూ. 3కే దొరుకుతోంది. ఇది నిజంగానే సూపర్ న్యూస్ కదా..!

ఆయా దేశాల్లో ప్రభుత్వ రాయితీలు, విస్తృతమైన చమురు నిల్వలు ఉండటంతో.. అక్కడ ఇంత తక్కువ ధరకే లీటర్ పెట్రోల్ అందుబాటులో ఉంది. ఇక ప్రపంచంలో పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి.

వాటిల్లో అత్యధికంగా హాంగ్‌కాంగ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 275 కాగా, మొనాకోలో రూ. 233, ఐస్‌ల్యాండ్‌లో రూ. 187, సింగపూర్‌లో రూ. 173, ఇటలీలో రూ. 172గా ఉంది.

ఇప్పటిలో దేశంలోని పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. గోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నా.. దేశీయంగా చమురు ధరలు స్థిరంగానే కొనసాగుతాయన్నారు. దేశానికి ముడి చమురు కొనుగోలు చేసేందుకు వేర్వేరు అవకాశాలు ఉన్నాయని.. ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. అది ధరలపై ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు.




