Special FD Rates: స్పెషల్ ఎఫ్‌డీలతో రాబడి మరింత స్పెషల్.. ఆ రెండు బ్యాంకులు ఎంత వడ్డీ ఆఫర్ చేస్తున్నాయంటే..?

భారతదేశంలో చాలా ఏళ్లుగా ఎఫ్‌డీలు మంచి రాబడి ఎంపికగా మారాయి. అయితే పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో బ్యాంకులు కూడా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇతర ఎఫ్‌డీలతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ రాబడినిచ్చేలా ఈ స్కీమ్స్‌ను లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్‌లో రూ.4 లక్షలు, రూ.8 లక్షలు పెడితే ఎంత రాబడి వస్తుందో ఓ సారి తెలుసుకుందాం.

Srinu

|

Updated on: Nov 05, 2024 | 3:15 PM

ఎస్‌బీఐ అమృత్ కలశ్ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లో సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తుంది.

1 / 5
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా యూనియన్ సమృద్ధి పేరుతో 333 రోజుల వ్యవధితో ప్రత్యేక ఎఫ్‌డీను అందుబాటులో ఉంచింది. సాధారణ పౌరులకు వడ్డీ రేటు 7.40 శాతం ఇస్తుంటే సీనియర్ సిటిజన్లు 7.90 శాతం వడ్డీని అందిస్తుంది.

2 / 5
రూ. 4 లక్షలను ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.36534 వడ్డీ వస్తుంది. అలాగే రూ.8 లక్షలను చేస్తే 73,068 వడ్డీ వస్తుంది.

3 / 5
అయితే సీనియర్ సిటిజన్లక రూ. 4 లక్షలను ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.39148 వడ్డీ వస్తుంది. అలాగే రూ.8 లక్షలను చేస్తే 78,296 వడ్డీ వస్తుంది.

4 / 5
యూనియన్ బ్యాంకులో రూ. 4 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 27,673.47 వస్తే రూ. 8 లక్షల పెట్టుబడిపై రూ. 55,346 వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు రూ.4 లక్షలపై రూ. 29,592 వడ్డీ వస్తే రూ.8 లక్షల పెట్టుబడిపై రూ. 59,184 వడ్డీ వస్తుంది.

5 / 5
Follow us