- Telugu News Photo Gallery Business photos Aadhaar pvc card at your home without going anywhere, Applying online is very easy, Aadhaar pvc Card details in telugu
Aadhaar Card: ఎక్కడికీ వెళ్లకుండా మీ ఇంటికే ఆధార్ కార్డు.. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయడం చాలా ఈజీ
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా మారింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా లేదా ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలన్నా ఆధార్‌ను ఉపయోగించడం తప్పనిసరి అయింది. అడ్రస్ ప్రూఫ్ నుంచి పిల్లల అడ్మిషన్ వరకు అన్ని చోట్లా దీనిని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధార కార్డును నిత్యం మనతో ఉంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి అతి తక్కువ ధరలో ఆధార్ పీవీసీ కార్డును పొందవచ్చని మీకు తెలుసా..? ఆన్‌లైన్‌లో ఆధార్ పీవీసీ ఎలా అప్లయ్ చేయాలో? ఓసారి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Nov 06, 2024 | 4:00 PM

మీ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో పీవీసీ కార్డును ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం మీరు స్పీడ్ పోస్ట్ ఖర్చుతో సహా రూ.50 మాత్రమే చెల్లించాలి. యూఐడీఏఐ ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) కార్డును జారీ చేస్తోంది.

ముందుగా మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత 'మై ఆధార్ సెక్షన్'లో 'ఆర్డర్ ఆధార్ పివిసి కార్డ్'పై క్లిక్ చేయండి.

మీరు ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేసిన వెంటనే, మీరు 12 అంకెల ఆధార్ నంబర్, వర్చువల్ ఐడీ లేదా ఈఐడీని పూరించాలి. ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను పూరించి, దీని తర్వాత కింద ఉన్న 'సెండ్ ఓటీపీ'పై క్లిక్ చేయాలి.


పేమెంట్ పూర్తయ్యాక మీకు ఆర్డర్ నెంబర్ మెసేజ్ వస్తుంది. అంతే పది నుంచి పదిహేను రోజుల్లో మీ ఆధార్ అడ్రస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది.





























