శుభలేఖ రూ.11 లక్షలు  !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు

శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు

Phani CH

|

Updated on: Nov 05, 2024 | 7:29 PM

ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా వివాహాన్ని చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు అందరూ ప్లాన్ చేస్తుంటారు. వివాహ పత్రిక నుంచే ఈ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. పసుపు రాసి పత్రిక చేతికి ఇచ్చి పెళ్లికి రమ్మని ఆహ్వానించడం మన దేశంలో ఆనవాయితీ.

ఎంతో ప్రత్యేకత కలిగిన వివాహ పత్రికలను చాలా మంది తమ అభిరుచులకు తగ్గట్లుగా డిజైన్ చేయించి బంధుమిత్రులకు పంచుతుంటారు. వెడ్డింగ్ కార్డ్స్‌లో రకరకాల డిజైన్లు అందుబాటులోకి వస్తుండటంతో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతోంది. పెళ్లి పత్రిక చాలా ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేవారు ఎక్కువవుతుండటంతో ఇప్పుడు ఇది ఖరీదైన వ్యవహారంగా మారింది. వెడ్డింగ్ కార్డ్స్ వ్యయం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అత్యంత ఖరీదైన పెళ్లి పత్రిక అందుబాటులోకి వచ్చింది. వెడ్డింగ్ కార్డ్స్ స్పెషల్‌గా ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారి కోసం ఉత్తర్‌ప్రదేశ్‌, ఫిరోజాబాద్‌లోని ఓ సంస్థ వినూత్న రీతిలో పెళ్లి పత్రికలు తయారు చేస్తోంది. మేలిమి బంగారం, వెండిపూతతో వెడ్డింగ్ కార్డ్స్ అచ్చు వేస్తోంది. అయితే గోల్డ్, సిల్వర్ వెడ్డింగ్ కార్డ్స్ కావాలనుకుంటే భారీగా ఖర్చు పెట్టాల్సిందే. వీటిని రూపొందిస్తున్న యూపీలోని లక్కీ జిందాల్ అనే వ్యాపారి రూ.10 వేల నుంచి రూ.11 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. కస్టమర్లు తమకు నచ్చిన డిజైన్స్, బడ్జెట్‌ను బట్టి పత్రికలను డిజైన్ చేయించుకోవచ్చని ఆయన అంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి

ఇల్లు శుభ్రం చేస్తుండగా మహిళకు దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. అందులోఉన్నది చూసి షాక్‌ !!

Vettaiyan OTT: ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!

హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్