Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం అవుతుంది: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో చేపట్టనున్న కులగణన ప్రక్రియ దేశానికి రోల్‌ మోడల్‌గా మారుతుందన్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. దీని ద్వారా దేశ అభివృద్ధి, రాజకీయ స్థితిగతులు మారతాయన్నారు. కులగణనను సమగ్రంగా జరిపించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు సీఎం రేవంత్.

Rahul Gandhi: తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం అవుతుంది: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2024 | 9:19 PM

కులగణన ద్వారా దేశంలో ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందని.. తెలంగాణలో చేపట్టనున్న కులగణన ప్రక్రియ దేశానికి రోల్‌ మోడల్‌గా మారుతుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీని ద్వారా దేశ అభివృద్ధి, రాజకీయ స్థితిగతులు మారతాయన్నారు. కుల గణన ద్వారా అభివృద్ధి ఫలాలు వారికి ఏ విధంగా అందించవచ్చనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే, కొందరు ఈ వాస్తవాలు బయటకు రావొద్దని భావిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటివరకు కులవివక్షపై ఎందుకు మాట్లాడలేదని రాహుల్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కువ అసమానతులు కలిగిన దేశంగా భారత్ ఉందని.. కులవివక్ష ఉన్న దగ్గర అసమానతలు మరింత ఎక్కువగా ఉంటాయని అన్నారు. దేశంలోని పలు వ్యవస్థలు, కంపెనీల్లో ఎంతమంది దళితులు, బీసీలు ఉన్నారు. ఈ వివరాలు అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారు. వీటిని అడ్డుకునే వాళ్లు వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం రాహుల్ గాంధీ హైదరాబాద్ లో పర్యటించారు. బోయిన్‌పల్లి ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలతో మాట్లాడటంతోపాటు.. కులగణన ప్రాధాన్యతను రాహుల్‌గాంధీ వివరించారు. కులగణనను సమగ్రంగా జరిపించే బాధ్యతను తాము తీసుకుంటామని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం: రేవంత్ రెడ్డి

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనను సమగ్రంగా జరిపిస్తామని తెలిపారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షలు సమర్థంగా నిర్వహించామని.. అందులో ఎక్కువమంది ఓబీసీ అభ్యర్థులే ఉన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2025లో కేంద్రం జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేబినెట్‌లో తీర్మానం చేశామని తెలిపారు.

ఇక రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బీసీ జనాభా గణాంకాల సేకరణకు డేడికేటెడ్ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..