Hyderabad: ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.! ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నగరంలోని టూ వీలర్ రైడర్స్ హెల్మెట్ లేకుండా దొరికితే.. భారీ ఫైన్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంతకీ అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా..
హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాజధానిలో మూడు రోజుల్లోనే హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేశామని చెప్పారు. హెల్మెట్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్
ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 215 మంది చనిపోయారని ట్రాఫిక్ పోలీస్‌లు ప్రకటించారు. వారిలో 100 మంది ద్విచక్ర వాహన చోదకులే అని పేర్కొన్నారు. వీరిలో 46 మంది హెల్మెట్ ధరించని కారణంగానే చనిపోయారని, హెల్మెట్ ధరిస్తే క్షతగాత్రులుగా మారే ప్రమాదం 70 శాతం, మృత్యువాతపడే ముప్పు 40 శాతం తగ్గుతుందని వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే చోదకులకు రిస్క్ మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ద్విచక్ర వాహనచోదకులు 100 శాతం హెల్మెట్ ధరించేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. అదే విధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైనా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించని వారికి రూ.200, రాంగ్ రూట్ డ్రైవింగ్‌కి రూ.2 వేలు జరిమానా విధిస్తామని తెలిపారు.
ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..