Caste Census: మొత్తం 75 ప్రశ్నలు.. ఫొటోలు తీయరు, అడగరు.. కులగణన సర్వే గురించి క్లియర్ కట్ సమాచారం మీకోసం
సమగ్ర సర్వేకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది.. తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే జరగనుంది.. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణాధికారి ఉంటారు.. ఈ సర్వేలో 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి.. అయితే, సర్వేలో భాగంలో ఇంటికి వచ్చిన అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు..? ఇంట్లో అందరూ ఉండాలా..? సమాధానాలు చెబితే సరిపోతుందా..? పూర్తి వివరాలను తెలుసుకోండి..

కులగణన.. తెలంగాణలో ఇప్పుడిదో హాట్ టాపిక్. ఒకేఒక్క సర్వేతో కులాల లెక్క తేలుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు నవంబర్-6ను డేట్‌గా ఫిక్స్ చేసింది. అంటే రేపే. మూడువారాల పాటు సాగే ఈ ప్రక్రియకోసం 50వేలమందికి పైగా సిబ్బంది పనిచెయ్యబోతున్నారు. ప్రైమరీ స్కూళ్లకు ఒంటిపూట బడులను పెట్టి మరీ వేలాదిమంది ఉపాధ్యాయులను లెక్కలు తీసే పనికి వాడబోతోంది ప్రభుత్వం. ఈ మూడు వారాల్లో. సదరు సిబ్బంది ఏదో ఒకరోజు మీ ఇంటికొస్తారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తారు. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణాధికారి కూడా ఉంటారు. ప్రత్యేకంగా సర్వే కిట్లు ఉన్నాయి. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటారు. పార్ట్-1, పార్ట్-2 కింద ఎనిమిది పేజీల్లో ఈ సమాచారాన్ని పూరిస్తారు. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.. ఈ సర్వేలో ప్రధాన ప్రశ్నలతోపాటు 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. సమగ్ర సర్వేకి వచ్చే సిబ్బంది మిమ్మల్నిగానీ, మీ కుటుంబీకులను గానీ ఫోటోలు తీయరు. అడగరు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు తీసుకోరు. కుటుంబంలో అందరూ ఉండాల్సిన అవసరంలేదు. కుటుంబ యజమాని అందుబాటులో ఉండి వివరాలు చెబితే సరిపోతుంది. ముందుగా...
