Telangana: కుక్కల దొంగలున్నారు..జాగ్రత్త..పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన దొంగలు..

కుక్కల దొంగలున్నారు..జాగ్రత్త..పెంపుడు కుక్కను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరాంనగర్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కపిల్లని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్లను ఎందుకు ఎత్తుకెళ్లారు?

Telangana: కుక్కల దొంగలున్నారు..జాగ్రత్త..పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన దొంగలు..
Thieves Took A Pet Dog In Peddapally
Follow us
G Sampath Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 05, 2024 | 6:00 PM

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరాంనగర్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కపిల్లని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు గేట్ తెరిచి ఉండడంతో బయటకు వచ్చిన కుక్కపిల్లను గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్ మీద మహిళా చున్నీతో కుక్కపిల్లపై కప్పి ఎత్తుకు వెళ్ళారు. ఈ దృశ్యాన్ని చూసిన ఇంటి యజమాని తన స్కూటీపై వారి వెనుక వెళ్ళగా వారు స్పీడ్‌గా వెళ్లి తప్పించుకున్నారు. ఈ దృశ్యాలు లద్మాపూర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

అంతే కాకుండా ఈ దొంగతనంపై బాధితుడు మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురు రెండు నెలల వయసున్న హచ్ కుక్కపిల్లను ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాదు నుండి తీసుకువచ్చిందని తన కుక్కను ఇంటిలో కుటుంబ సభ్యుల మాదిరి పెంచుకున్నామని కుక్క యజమాని తెలిపాడు. ప్రతిరోజు గుడ్డు, చికెన్ పెట్టి పెంచుకున్నామని చెప్పుకొచ్చాడు. తమ కుక్క పిల్లను తమ ఇంటి వద్ద వదిలేయాలని ఆయన వేడుకున్నారు. అయితే పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి