Telangana: సత్తా చాటిన తెలంగాణ పోలీస్.. అందులో దేశంలోనే రెండో స్థానం..!
తెలంగాణ రాష్ట్రం మొబైల్ రికవరీలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2023 ఏప్రిల్ 20 నుండి 2024 నవంబర్ 3 వరకు మొత్తం 50,788 మొబైల్ పరికరాలను తిరిగి పొందింది. 2023 మే 17న దేశవ్యాప్తంగా సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ప్రారంభమైంది.
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా మొబైల్ పరికరాల రికవరీలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. ఈ పోర్టల్‌ను ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ (DoT) అభివృద్ధి చేసింది. ఇది మొబైల్ దొంగతనాలు, నకిలీ పరికరాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.
వేగవంతమైన రికవరీ
తెలంగాణ రాష్ట్రం 50,000 పరికరాల రికవరీ గమనాన్ని కర్ణాటకా కంటే 172 రోజులు ముందుగానే పూర్తి చేసింది. రాష్ట్రం ఇప్పుడు సగటున రోజుకు 91 పరికరాలను తిరిగి పొందుతోంది. ఇది జూలై 2024లో 87 పరికరాలు రోజుకు రికవర్ చేశారు. CEIR పోర్టల్ తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ 780 పోలీసు స్టేషన్లలో అమలులో ఉంది. సైబర్ క్రైమ్ CID, DoT అధికారులతో కలిసి సమన్వయంతో తెలంగాణ పోలీసులు ఈ ఆపరేషన్లను విజయవంతంగా అమలు చేస్తున్నారు. DOT సమన్వయంతో CEIR పోర్టల్‌ను తెలంగాణ పోలీసుల పోర్టల్‌తో అనుసంధానం చేశారు. పౌరులు తమ చోరీ అయిన మొబైల్ పరికరాలను www.tspolice.gov.in లేదా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా రికవరీ ప్రక్రియ సులభం అవుతుంది. రాష్ట్రంలో అత్యుత్తమంగా పనిచేసిన పోలీస్ యూనిట్లు మరియు పోలీస్ స్టేషన్లను సీఐడీ చీఫ్ షికా గోయల్ అభినందించారు. మొత్తం 11 ఉత్తమ యూనిట్లు, ఉత్తమ పోలీస్ స్టేషన్లకు ప్రశంస పత్రాలు ఆయన అందజేశారు.