- Telugu News Photo Gallery Technology photos Samsung soon launching new smartphone Samsung A56 features and price details
Samsung: సామ్‌సంగ్ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్
సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సామ్‌సంగ్ ఏ56 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌తో పాటు, భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్న ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి నెట్టింట కొన్ని వార్తలు లీక్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 05, 2024 | 9:30 PM

టెక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి సామ్‌సంగ్ ఏ56 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. 1080 x 2340 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈ ఫోన్‌లో ఏకంగా 280 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారి తెలుస్తోంది. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 62 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ప్రైమరీ కెమెరాతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను చిత్రీకరించవచ్చు.

అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ అనుభవాన్ని ఇచ్చేలా ఈ కెమెరాను డిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. తక్కువ లైటింగ్ ఉన్న కండిషన్స్‌లో కూడా క్లారిటీ ఫొటోలను ఈ కెమెరా అందించనుందని తెలుస్తోంది.

ఇక ఈ ఫోన్‌లో బ్యాటరీకి కూడా పెద్ద పీట వేయనున్నారని తెలుస్తోంది. సామ్‌సంగ్ ఏ56లో ఏకంగా 7600 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారి తెలుస్తోంది. లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని చెబుతున్నారు.

సామ్‌సంగ్ ఏ56 స్మార్ట్ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారని తెలుస్తోంది. ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.




