- Telugu News Photo Gallery Technology photos Can artificial intelligence effects on jobs know what meta AI says
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలన్నీ పోతాయా.? ‘మెటా ఏఐ’ సమాధానం ఏంటో తెలుసా..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ప్రపంచ్యవాప్తంగా ఈ టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐ రాకతో ఉద్యోగాలు పోవడం ఖాయమనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. నిజంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయా.? ఇదే ప్రశ్నకు ఏఐ ఏమని సమాధానం ఇచ్చిందంటే..
Updated on: Nov 05, 2024 | 8:52 PM

ఆర్థిక మాంధ్యం ఇంకా రాక ముందే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో బడా సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. ఓ నివేదిక ప్రకారం వచ్చే కొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఏఐతో నిజంగానే ఇంత విధ్వంసం జరుగుతుందా అన్న ప్రశ్నకు మెటా ఏఐ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తోంది. అయితే ఏఐ వల్ల మనుషులు ఉద్యోగాలు పోతాయని అనడం మాత్రం అన్యాయం అంటూ బుదులు ఇచ్చింది.

ఏఐతో ఉద్యోగాల తీరు మారుతుంది. అలాగే ఎన్నో కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని మెటా ఏఐ బదులిచ్చింది. అలాగే అనేక రంగాలలో AI ఉత్పాదకతను, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని అదే సమయంలో.. కొత్త నైపుణ్యాల కోసం డిమాండ్ ఏర్పడుతుందని తెలిపింది.

ఏఐ ద్వారా రానున్న రోజుల్లో ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకురానున్నాయని అయితే అందుకు కావాల్సిన నైపుణ్య కొరత కూడా భారీగా ఉంటుందని ఇప్పటికే పలువురు టెక్ నిపుణులు సైతం చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రాంప్ట్ ఇంజనీర్లకు ఓ రేంజ్‌లో డిమాండ్ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ టెక్నాలజీపై పట్టున్న వారికి కంపెనీలు రూ. లక్షల్లో ప్యాకేజీలను ఆఫర్ చేస్తాయని అంటున్నారు. మరి ఏఐ ఎలాంటి సంచలనానికి తెర తీస్తుందో చూడాలి.





























