- Telugu News Photo Gallery Technology photos Tech Tips and Tricks How to remove scratches from your smartphone display
Tech Tips: మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై గీతలు పడ్డాయా? ఇలా సులభంగా తొలగించండి!
Tech Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దాని వాడే విధానం కారణంగా చాలా మంది మొబైల్ స్క్రీన్ దెబ్బతింటుంది. ఫోన్ స్క్రీన్ గార్డు ఉన్నప్పటికీ చిన్నపాటి గీతలు పడటం, లేదా పగలడం లాంటివి కనిపిస్తుంటాయి. కానీ స్క్రీన్‌పై పడిన గీతలను సులభంగా తొలగించవచ్చు.. ఎలాగో తెలుసా?
Updated on: Nov 05, 2024 | 12:31 PM

Tech Tips: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రకరకాల మొబైల్స్ ఉన్నాయి. మడతపెట్టే ఫోన్ల నుంచి కీప్యాడ్ మొబైల్స్ వరకు అన్నీ కొంటారు. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు తక్కువ ధరలకు సులువుగా లభిస్తున్నందున అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.

చాలా మంది మొబైల్ డిస్‌ప్లేలు దెబ్బతినడం చూసే ఉంటారు. అలాగే స్క్రీన్ కవర్‌ని వాటిపై గీతలు పడటం లాంటివి చూసే ఉంటారు. ఇలా మీ ఫోన్‌లోని స్క్రాచ్‌ను సులభంగా తొలగించవచ్చు. అది ఎలాగో చూద్దాం.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా గీతలు తొలగించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గిన్నెలో నీరు, బేకింగ్ సోడా కలపండి. ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసి, కాటన్ క్లాత్‌ని ఉపయోగించి స్క్రాచ్‌ను తొలగించండి. అలాగే మార్కెట్లో అనేక కార్ స్క్రాచ్ రిమూవల్ క్రీమ్‌లు ఉన్నాయి. వాటిలో దేనినైనా ఉపయోగించి మీ ఫోన్ డిస్‌ప్లే స్క్రాచ్‌ని తీసివేయవచ్చు.

ఎగ్ వైట్: మీరు ఫోన్ స్క్రాచ్‌లను తొలగించడానికి గుడ్డులోని తెల్లసొన, పొటాషియం సల్ఫేట్‌ను ఉపయోగించవచ్చు. రెండింటినీ కలపండి. ఈ మిశ్రమంతో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను తుడవండి. బేబీ పౌడర్‌తో డిస్‌ప్లే స్క్రాచ్‌లను కూడా తొలగించవచ్చని మీకు తెలుసా? ఒక గిన్నెలో నీరు, బేబీ పౌడర్ కలపండి. ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసి, కాటన్ క్లాత్‌ని ఉపయోగించి గీతలు పడిన ప్రదేశంలో అప్లై చేయండి. ఇలా చేసినా స్క్రీన్‌పై పడిన గీతలు తొలగిపోతాయి.

కొంచెం తడిగా ఉన్న గుడ్డ లేదా పత్తితో శుభ్రం చేయడం సులభమయిన పద్ధతి. మెత్తటి గుడ్డతోగానీ, కాటన్‌తో గానీ కోసం తడిగా ఉంచి గీతలు ఉన్న స్క్రీన్‌పై మెల్లగా రప్ చేయడం ద్వారా కూడా మీ ఫోన్ స్క్రీన్‌పై పడిన గీతలు తొలగిపోతాయి.

పెట్రోలియం జెల్లీ సహాయం తీసుకోండి: చాలా గృహాలలో (వాసెలిన్ పెట్రోలియం జెల్లీ) ఉంటుంది. దాని సహాయంతో మీరు మీ ఫోన్ స్క్రీన్‌ను ఫ్లాష్ చేయవచ్చు. ఫోన్ స్క్రీన్‌పై వాసెలిన్‌ను రాసుకుని శుభ్రమైన గుడ్డతో తుడవడం వల్ల స్క్రీన్ మెరుస్తూ గీతలు పోతాయి.

టూత్‌పేస్ట్ కూడా మంచి ఎంపిక: ఫోన్ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి దంతాల శుభ్రం కోసం ఉపయోగించే టూత్‌పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు. మీరు టూత్‌పేస్ట్‌ను కాటన్‌పై అప్లై చేసి డిస్‌ప్లేపై రుద్దాలి. ఈ ట్రిక్ స్క్రీన్‌పై అన్ని రకాల గీతలు కనిపించకుండా చేస్తుంది. దీని కోసం మీరు తెల్లటి టూత్‌పేస్ట్‌ను మాత్రమే అప్లై చేయాలి.





























