- Telugu News Photo Gallery Technology photos Best smart phones under 10k in amazon, check here for full details
SmartPhone: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10 వేలలో ఇవే బెస్ట్ ఫోన్స్..
మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తున్న తరుణంలో. మారిన ఫీచర్లకు అనుగుణంగా కొత్త ఫోన్‌లకు అప్‌గ్రేడ్ కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ధర ఎక్కువనే ఉద్దేశంతో ఫోన్‌లను మార్చడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. మరి రూ. 10 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్‌లు, వాటి ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 04, 2024 | 9:35 PM

itel color pro 5g: ఈ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 9,490కి లభిస్తోంది. ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. ఫోన్‌లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ కకెపాసిటీ గల బ్యాటరీని అందించారు. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ఆఫర్ లభిస్తోంది.

realme NARZO N61: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 8498కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇందులో 90 హెచ్‌జెడ్‌తో కూడిన ఐ కంఫర్ట్ డిస్‌ప్లేను అందించారు. ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్ సొంతం. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

Redmi 13C 5G: రూ. 10 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ ఫోన్ ఇది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 8,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందింఆచరు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్‌ను అందించారు.

Samsung Galaxy M05: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 9,999కాగా అమెజాన్‌లో రూ. 7999కి లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించార. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 25 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

TECNO POP 9 5G: ఈ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,499కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 48 ఎంపీతో కూడని సోనీ ఏఐ కెమెరాను అందించారు. 5జీ సపోర్ట్ చేసే ఈ ఫోన్ NFCకి సపోర్ చేస్తుంది. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లను అందించారు.





























