Asus Rog Phone 9: అసుస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌..

మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ అసుస్‌ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. అసుస్‌ రాగ్‌ ఫోన్‌ 9పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Nov 04, 2024 | 9:03 PM

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ అసుస్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. అసుస్‌ రాగ్‌ ఫోన్‌ 9పేరుతో గ్లోబల్‌ మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారత్‌లోనూ ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

1 / 5
నవంబర్‌ 19వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అప్ గ్రేడెడ్ అనిమీ విజన్ ఫీచర్ తోపాటు ఏఐ ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో తీసుకొస్తున్నారు.

2 / 5
ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. వీటి ప్రకారం.. ఈ ఫోన్‌ 6.78 ఇంచెస్‌తో కూడని ఫుల్‌ హెచ్‌డీతో కూడిన ఎల్టీపీఓ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు.

3 / 5
ఇక అసుస్‌ రాగ్ ఫోన్‌9 క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్+512 జీబీ స్టోరేజీని అందించనున్నారు. 185Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 65 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5800 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us