31 October 2024
Subhash
దేశమంతటా ప్రజలకు ఆధార్ కార్డ్ సంబంధిత సేవలను అందించడానికి దేశవ్యాప్తంగా మొత్తం 13,352 ఆధార్ నమోదు, అప్‌డేట్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఆధార్ కేంద్రాల వద్ద ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు ప్రజలు పెద్ద క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టల్ శాఖ కూడా ఆధార్ సంబంధిత సేవలను అందించడం ప్రారంభించిందని తపాలా శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
పోస్టాఫీసులలో రెండు రకాల ఆధార్ నమోదు, అప్‌డేట్ సేవలను అందుబాటులో ఉండనున్నాయి.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌లో వ్యక్తుల బయోమెట్రిక్ సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌గా నమోదు చేయడం ద్వారా ఈ సేవను ఉచితంగా పొందవచ్చు.
ఆధార్ అప్‌డేట్‌లో ఎవరైనా తమ పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, ఫోటో, ఐరిస్ ఏదైనా పొరపాటు లేదా గడువు ముగిసినట్లయితే అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఈ సేవ దేశంలోని 13,352 కేంద్రాలలో అందుబాటులో ఉంది. ఏ పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయో https://www.indiapost.gov.in/లో తనిఖీ చేయండి.
గుర్తింపు రుజువు, చిరునామా రుజువు పత్రాలతో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌ను అప్‌డేట్ చేయాలని కేంద్రం సూచిస్తోంది.