Business Idea: ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్

ఏదైన వ్యాపారం మొదలు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే నష్టాలు వస్తాయన్న భయంతో వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో నష్టాలు లేని వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం...

Business Idea: ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 05, 2024 | 4:58 PM

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలి. చాలా మంది ఇదే ఆలోచనతో ఉంటారు. అయితే ఎలాంటి బిజినెస్‌ను ప్రారంభించాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఏ బిజినెస్‌తో లాభాలు వస్తాయో తెలియక వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బనానా పౌడర్‌ బిజినెస్‌ ప్రస్తుతం ఉన్న ట్రెండీ బిజినెస్‌లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అరటి పండు పొడి వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అరటి పండ్లతో పాటు బనానా డ్రయర్‌ మిషిన్స్‌, మిక్సర్‌ మిషన్‌ కావాల్సి ఉంటుంది. మార్కెట్లో ప్రస్తుతం ఈ మిషిన్స్‌ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. మీకు అరటి తోట ఉంటే మరీ మంచిది. లేదంటే.. మార్కెట్లో హోల్‌ సేల్‌గా వాటిని కొనుగోలు చేయొచ్చు.

ఇందుకోసం ముందుగా అరటి పండ్లను సేకరించి సోడియం హైపో క్లోరైడ్‌తో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తొక్కలను ఒలిచి అరటి గుజ్జును సిట్రిక్‌ యాసిడ్‌లో కాసేపు ఉంచి తర్వాత అరటి గుజ్జును చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వాటిని ఒక రోజు పాటు 66 డిగ్రీల సెల్సియస్ గాలి వద్ద ఆరబెట్టాలి. ఇది డ్రయర్ మిషిన్ పని. ముక్కలు బాగా ఆరిన తర్వాత తీసి గ్రైండ్ చేయాలి అంతే.. బనానా పౌడర్ రడీ అయినట్లే.

అనంతరం పొడిని కవర్‌ లేదా సీసాల్లో నింపి విక్రయించాలి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అరటి పొడి ధర రూ. 800 నుంచి రూ. 1000 మధ్య ఉంది. పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లలో, ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించుకోవచ్చు. ఇక అరటి పొడిని ఏం చేసుకుంటారని ఆలోచిస్తున్నారు. అరటి పౌడర్‌ను పాలలో కలుపుకొని తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు బనానా పౌడర్‌తో చెక్‌ పెట్టొచ్చు. కాబట్టి మీరు మంచి పబ్లిసిటీ చేసుకుంటే లాభాలు భారీగా పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..