Public Provident Fund Scheme: పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరితే రూ.10 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..!

Public Provident Fund Scheme: కేంద్ర సర్కార్‌ అందిస్తున్న పథకాల్లో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) స్కీమ్‌ కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరితో తప్పకుండా రాబడి పొందవచ్చు..

Public Provident Fund Scheme: పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరితే రూ.10 లక్షలు సంపాదించవచ్చు... ఎలాగంటే..!
Ppf
Follow us
Subhash Goud

|

Updated on: Apr 21, 2021 | 7:59 PM

Public Provident Fund Scheme: కేంద్ర సర్కార్‌ అందిస్తున్న పథకాల్లో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) స్కీమ్‌ కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరితో తప్పకుండా రాబడి పొందవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే బ్యాంకు సిబ్బందిని అడిగినా తెలియజేస్తారు. లేదంటే పోస్టాఫీసుల్లో కూడా పీపీఎఫ్‌ స్కీమ్‌ అందుబాటులో ఉంది.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అంటే మీరు 15 సంవత్సరాలు డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉండాలి. మీరు పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. పెట్టిన డబ్బులు, వచ్చిన వడ్డీ, తీసుకునే డబ్బులపై పన్ను పడదు.

ప్రస్తుతం పీపీఎఫ్‌ పథకంపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు నెలకు రూ.3వేలు పీపీఎఫ్‌లో పెడితే మెచ్యూరిటీ సమయం వరకు రూ.10 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఇన్వెస్ట్‌ చేసే డబ్బు రూ.5.4 లక్షలు అవుతుంది. మీకు రూ.4.4 లక్షలు అదనంగా వడ్డీ రూపంలో పొందవచ్చు.

పీపీఎఫ్‌ స్కీమలో చేరే వారు దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. అలాగే వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌పై వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి సమీక్షిస్తుంది. అంటే రేట్లు పెరగవచ్చు… లేదా తగ్గొచ్చు. ఇంకా స్థిరంగా కూడా కొనసాగవచ్చు కూడా.

ఇవీ చదవండి: మీకు ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఫోన్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త…వెలుగులోకి వస్తున్న మోసాలు

Hero MotoCorp: హీరో కంపెనీ సంచలన నిర్ణయం.. టూవీలర్ల తయారీ నిలిపివేత…! ఎందుకో తెలుసా..?

LIC: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు… కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు

కరోనాలోనూ దేశంలో బంగారం దిగుమతుల జోరు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పసిడి ఎంత దిగుమతి అయ్యిందో తెలిస్తే…