భర్త పై పగ పెంచుకున్న ఇల్లాలు.. అతడిని ఇరికించేందుకు భారీ స్కెచ్.. చివరికి ఉహించని షాక్… ఏం జరిగిందంటే..

ఓ భార్యకు భార్తపై అనుమానం. అతడిని ఎలాగైనా కటకటాల్లోకి నెట్టాలని భావించింది. ఇందుకోసం పెద్ద స్కేచ్ వేసింది.

భర్త పై పగ పెంచుకున్న ఇల్లాలు.. అతడిని ఇరికించేందుకు భారీ స్కెచ్.. చివరికి ఉహించని షాక్... ఏం జరిగిందంటే..
Plants Marijuana
Rajitha Chanti

|

Apr 23, 2021 | 7:26 AM

ఓ భార్యకు భార్తపై అనుమానం. అతడిని ఎలాగైనా కటకటాల్లోకి నెట్టాలని భావించింది. ఇందుకోసం పెద్ద స్కేచ్ వేసింది. అయితే చివరికి అది బెడిసికొట్టింది. తనను మోసం చేస్తున్నాడని అతడిని ఇరికించాలని ప్లాన్ చేయడం.. అది ఫెయిల్ అయి చివరికి తనకే ఎదురుదెబ్బ తగిలింది. వింటుంటే అచ్చం సినిమా స్టోరీలాగా ఉంది కదూ. కానీ ఇది నిజంగానే జరిగింది. ఈ షాకింగ్ ఘటన హార్యానాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. ఫరీదాబాద్‏కు చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ.. తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి అతను రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. అలా ఒక్కోరోజు అసలు ఇంటికే వెళ్ళేవాడు కాదు. దీంతో తన భర్తపై తీరుపై భార్యకు అనుమానం కలిగింది. Haryana

ఇక ఈ క్రమంలోనే తన భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని అనుమాన పడింది. ఇదే విషయమై భర్తతో పలు మార్లు చర్చించగా.. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇక వాటితో విసిగిపోయిన మహిళ.. ఎలాగైన అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని బారీ ప్లాన్ వేసింది. ఢిల్లీ వెళ్లి మరీ ఓ వ్యక్తి వద్ద గంజాయి మొక్కను marijuan plant  కొనుక్కొచ్చింది. సుమారు 700 గ్రాముల గంజాయి మొక్కను తన భర్త ఆటోలో పెట్టింది. తరువాత తనకేం సంబంధం లేనట్లు గుర్తు తెలియని మహిళ మాదిరిగా పోలీసులకు ఫోన్ చేసి గంజాయి విషయం చెప్పి భర్తను బుక్ చేయాలని చూసింది. ఇంకేముంది పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇక అందులో అసలైన కిలాడీ అతడి భార్యే అని తెలిసి ఆమెకు షా క్ పోలీసులు. ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Also Read: మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 

పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu