సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం… పూజా హెగ్డేకు కోవిడ్ పాజిటివ్.. క్వారంటైన్‏లో బుట్టబొమ్మ..

Pooja Hegde: దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండం...

సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం... పూజా హెగ్డేకు కోవిడ్ పాజిటివ్.. క్వారంటైన్‏లో బుట్టబొమ్మ..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 26, 2021 | 12:29 PM

Pooja Hegde: దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండం… లక్షల సంఖ్య మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలు మరింత కట్టుదిట్టం చేశాయి. ఇక ఈ మహమ్మారి సామాన్యులతోపాటు రాజకీయ ప్రముఖులను కూడా వదలడం లేదు. కరోనా వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీని మరోసారి దెబ్బతీస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా భారిన పడగా.. తాజాగా టాలీవుడ్ బుట్టబోమ్మ కొవిడ్ సోకింది. ఈ ఈ విష‌యాన్ని ఆమె ఆదివారం నాడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. కోవిడ్ బారిన ప‌డిన త‌ను నిబంధ‌న‌ల ప్ర‌కారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని తెలిపింది. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నాన‌ని వెల్ల‌డించింది. త‌న‌ను క‌లిసిన‌వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలని సూచించింది. ఎల్ల‌ప్పుడూ త‌న వెంటే ఉంటూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది. (Covid 19)

ప్రస్తుతం పూజాహెగ్డే… యంగ్ హీరో అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తోంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడీగా రాదేశ్యామ్ చిత్రంలో నటిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనపించనుంది పూజా హెగ్డే. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌ను ఫాలో చేస్తున్న‌వారి సంఖ్య‌ కోటీ 30 ల‌క్ష‌లు దాట‌డంతో ఫ్యాన్స్‌కు చెప్పింది పూజా. అంద‌రీక హ‌గ్గులు, ముద్దులు అంటూ పోస్ట్ పెట్టింది. కానీ అంత‌లోనే కోవిడ్ సోకిందంటూ బాధాక‌ర‌మైన వార్త‌ను షేర్ చేసింది.

ట్వీట్..

Also Read: సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..

UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

Post Office Monthly Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.5 వేల రాబడి పొందవచ్చు