Salman Khan And Allu Arjun: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సల్మాన్ ఖాన్.. లవ్ యూ బ్రదర్ అంటూ..
Salman Khan And Allu Arjun: పాన్ ఇండియా సినిమాలు వస్తున్నప్పటి నుంచి హీరోల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఒక ఇండస్ట్రీకి చెందిన బడా హీరోలు మరో...
Salman Khan And Allu Arjun: పాన్ ఇండియా సినిమాలు వస్తున్నప్పటి నుంచి హీరోల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఒక ఇండస్ట్రీకి చెందిన బడా హీరోలు మరో ఇండస్ట్రీకి చెందిన హీరో గురించి మాట్లాడుతున్నారు. దీంతో అభిమానుల మధ్యే పోటీ ఉంటుంది కానీ.. తమ మధ్య కాదని చాటి చెబుతున్నారు కొందరు హీరోలు. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్.. అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ రాధే అని చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభుదేవా.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన డీజే సినిమాలోని సీటీ మార్ పాటను రీమేక్ చేశారు. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే.. అల్లుఅర్జున్ డ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు సల్మాన్. ట్విట్టర్ వేదికగా.. సీటీమార్ పాటను మాకు అందించినందుకు ధన్యవాదాలు. నువ్వు ఈ పాటలో డ్యాన్స్ చేసిన తీరు అద్భుతం. జాగ్రత్తగా ఉండూ బ్రదర్ లవ్ యూ అంటూ ట్వీట్ చేశారు.
సల్మాన్ చేసిన ట్వీట్..
Thank u Allu arjun for seeti maar absolutely loved the way u have performed in the song, the way u dance, your style, u r simply fantastic.. tk care n b safe. Rgds to ur family .. love u brother @alluarjun#SeetiMaar https://t.co/St8cWOmNKX
— Salman Khan (@BeingSalmanKhan) April 26, 2021
సల్మాన్‌లాంటి బడా హీరో తన డ్యాన్స్‌పై స్పందించడం పట్ల అల్లు అర్జున్ కూడా ఖుషీ అయ్యారు. సల్మాన్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బన్నీ ట్వీట్ చేస్తూ.. సల్మాన్ గారు మీకు ధన్యవాదాలు. మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నిజంగా మరిచిపోలేని అనుభూతి. మీ అభిమానులు రాధే సినిమా థియేటర్లలో సీటీమార్ వేయడం కోసం ఎదురు చూస్తున్నాను. మీ ప్రేమకు నా ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
అల్లు అర్జున్ ట్వీట్..
Thank you soo much Salman garu . It’s a pleasure to receive a compliment from you . It’s such a sweet gesture. Looking forward for the RADHE magic on screens with fans doing SEETI MAAR for you . Thank you for your love . ?AA
— Allu Arjun (@alluarjun) April 26, 2021
Also Read: కోవిడ్ పై ఆందోళన వద్దు, అనవసర భయాలతో చేటు, ప్రజలకు కేంద్రం హెచ్చరిక