సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన మరో హీరోయిన్.. ఇదే నా ఆఖరి పోస్ట్ అంటూ ట్వీట్..

Warina Hussain: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ వరీనా హుస్సేన్.. లవ్ యాత్రీ సినిమాతో బీటౌన్ లోకి అడుగుపెట్టింది.

సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన మరో హీరోయిన్.. ఇదే నా ఆఖరి పోస్ట్ అంటూ ట్వీట్..
Warina Hussain
Rajitha Chanti

|

Apr 26, 2021 | 4:20 PM

Warina Hussain: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ వరీనా హుస్సేన్.. లవ్ యాత్రీ సినిమాతో బీటౌన్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సల్మాన్ నటింటిన దబాంగ్ 3 చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. తాజాగా ఈ అమ్మడు సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ళపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నానని వెల్లడించింది. దీంతో కొద్దిరోజుల పాటు తాను సోషల్ మీడియాలో కనిపించను అంటూ ప్రకటించింది. నిజానికి ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని విన్నాను. కానీ నా ఫ్యాన్స్ ప్రేమాభిమానలే నా బలం.. కాబట్టి దీన్ని తప్పకుండా షేర్ చేసుకోవాల్సిందే. సోషల్ మీడియాలో ఇదే నా ఆఖరి పోస్ట్.. ఇక మీదట నా సినిమా అప్ డేట్స్ లను టీం దగ్గరుండి చూసుకుంది. వారే అన్ని ఖాతాలను డీల్ చేస్తారు అంటూ ట్వీట్ చేశారు వరీనా.

Wareena Hussan

ఆకస్మాత్తుగా సోషల్ మీడియాకు బై చెప్పడంతో ఆమె అభిమానులు ఎందుకు వెళ్ళిపోతున్నారు.. “? మీరు లేకుండా ఆన్ లైన్ లో ఎలా ఉండగలుగుతాం ? అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతేడాది అమీర్ ఖాన్ కూడా సోషల్ మీడియా నుంచి తాత్కలికంగా బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా వరీనా కూడా అదే బాటలో నడిచింది. ప్రస్తుతం ఆమె ‘పోస్టర్‌’, ‘ఇన్‌కంప్లీట్‌ మ్యాన్‌’ సినిమాల్లో నటిస్తోంది. కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలోనూ వరీనా ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ట్వీట్..

Also Read: Pelli Sandadi 2: ఆ రోజునే దర్శకేంద్రుడి కొత్త పెళ్లి ‘సందడి’ మొదలయ్యేది..  డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. 

Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్న సూప‌ర్ స్టార్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్ బాబు..

సర్కారు వారి పాట నుంచి సరికొత్త అప్డేట్.. సూపర్ స్టార్ పుట్టినరోజున అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu