Eye Care: కంట్లో చుక్కల మందు అనుకుని..జిగురు చుక్కలు వేసేసుకుంది..తరువాత ఏం జరిగిందంటే..
ఒక్కోసారి మనం చేసే చిన్న పొరపాట్లు మనకు ఎంతో కష్టాన్ని తెచ్చిపెడతాయి. ప్రాణాంతకంగా కూడా మారిపోతుంటాయి. చిన్న అజాగ్రత్త పెద్ద ముప్పును తీసుకువస్తుంది.
Eye Care: ఒక్కోసారి మనం చేసే చిన్న పొరపాట్లు మనకు ఎంతో కష్టాన్ని తెచ్చిపెడతాయి. ప్రాణాంతకంగా కూడా మారిపోతుంటాయి. చిన్న అజాగ్రత్త పెద్ద ముప్పును తీసుకువస్తుంది. అదే జరిగింది మిచిగన్‌కు చెందిన యాసిడ్రా విలియమ్స్ అనే ఆమెకు. చిన్న పొరపాటుతో కన్నుపోయేంత పని జరిగింది. ఈమె అనుభవం కాంటాక్ట్ లెన్స్ వాడేవారికి తప్పనిసరిగా తెలియాలి.
కాంటాక్ట్ లెన్స్ వాడేవారు నిద్రపోయే ముందు వాటిని తీసేసి పడుకోవాలి. అది అలవాటుగా మారిపోతుంది. కానీ, ఇటీవల ఒకరోజు విలియమ్స్ కాంటాక్ట్ లెన్స్ ఉండగానే నిద్రలోకి జారిపోయింది. కొద్దిసేపటి తరువాత ఆమెకు మెలకువ వచ్చింది. కళ్ళు పొడిగా అయిపోయినట్లనిపించాడంతో.. కాంటాక్ట్ లెన్స్ తీసేయాలని భావించింది. దీంతో కంట్లో డ్రాప్స్ వేసుకోవడం కోసం ఆ నిద్ర కళ్ళతోనే తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక సీసా తీసి రెండు డ్రాపులు కంట్లో వేసుకుంది. వెంటనె ఆమె కళ్ళు మండడం ప్రారంభం అయింది. కళ్ళు దురదలు రావడంతో పాటు లెన్స్ చుట్టూ గట్టిగా అయిపోవడం మొదలైంది. దీంతో ఆమె తన చేతిలో ఉన్న డ్రాప్స్ వైపు చూసి షాక్ తింది.. నిద్ర కళ్ళతో హ్యాండ్ బాగ్ నుంచి ఐడ్రాప్స్‌కు బదులు.. గోళ్లకు ఉపయోగించే నైల్ గ్లూ (విరిగిన గోళ్లను అతికించే జిగురు) బాటిల్‌ను ఆమె బయటకు తీసింది. బాటిళ్ల సైజు ఒకేలా ఉండటంతో ఆమె దాన్ని ఐ డ్రాప్స్ అనుకుని జిగును కంట్లో వేసుకుంది. జరిగిన తప్పు గ్రహించి వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టింది ఆమె.
డాక్టర్లు సుమారు మూడు గంటలు శ్రమించి జిగురు వల్ల అతుక్కుపోయిన ఆమె కనుపాపలను విడదీశారు. ఆ తర్వాత కంట్లో పేరుకుపోయిన జిగురును శుభ్రం చేశారు. ఆమె కంట్లో ఉన్న కాంటాక్ట్ లెన్స్ చూపు కోల్పోకుండా కాపాడాయని వారన్నారు. కానీ, దీని వల్ల ఆమె కను రెప్పల వెంటుకలు ఊడిపోయాయి. అవి జిగురుకు అతుక్కుపోవడం వల్ల డాక్టర్లకు వాటిని తొలగించక తప్పలేడు. ఇదీ విషయం.. ఏపనైనా చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించి చేయకపోతే ఇలాగే అవుతుంది. అందులోనూ కంటిలో వాడే మందుల విషయంలో అజాగ్రత్తగా ఉంటె కళ్ళు పోయే ప్రమాదం ఉంది.
ఈ ట్వీట్ ఒకసారి చూడండి..
Woman glues eye shut after mistaking nail glue for eye drops. ‘I just started throwing cold water, and I was trying to pull my eyes apart but couldn’t.’ Hubbie called 911.
ER doc: stuck contact lens saved Yacedrah Williams’ vision.#thursdayvibes https://t.co/2J66IQJB9m
— ?Darwin? (@jf_darwin) April 22, 2021
Whatsapp: 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్.. వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్..!