AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Antiviral Drug: కరోనా బాధితులకు గుడ్‌న్యూస్.. కోవిడ్ చికిత్సకు హైదరాబాదీ డ్రగ్.. అత్యవసర అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు..!

కరోనా కట్టడికి సరియైన మందు లేక జనం నానావస్థలు పడుతున్నారు. తాజాగా కరోనా చికిత్సకు హైదరాబాద్‌ కేంద్రంగా మరో ఔషధం ఉత్పత్తి కానున్నది.

Covid Antiviral Drug: కరోనా బాధితులకు గుడ్‌న్యూస్..  కోవిడ్ చికిత్సకు హైదరాబాదీ డ్రగ్.. అత్యవసర అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు..!
Molnupiravir For Use In Covid 19 Treatment
Balaraju Goud
|

Updated on: Apr 27, 2021 | 6:39 AM

Share

Hyderabad new antiviral drug: కరోనా వైరస్ మహమ్మారి కనిపించిన వారినల్లా కాటేసుకుంటూ వెళ్తోంది. చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగులుస్తోంది. వైరస్ ప్రబలి ఏడాది గడుస్తున్నా.. సరియైన మందు లేక జనం నానావస్థలు పడుతున్నారు. తాజాగా కరోనా చికిత్సకు హైదరాబాద్‌ కేంద్రంగా మరో ఔషధం ఉత్పత్తి కానున్నది. ప్రముఖ హైదరాబాదీ ఫార్మాసంస్థ నాట్కో ఫార్మా ‘మాల్‌నుపిరవిర్‌’ పేరుతో దీనిని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన మేజర్‌మెర్క్‌, రిడ్జ్‌బ్యాక్‌ సంస్థలు ‘మాల్‌నుపిరవిర్‌’ ట్యాబ్లెట్లను అభివృద్ధి చేశాయి. ఇవి కొవిడ్‌ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ప్రకటించాయి.

ఈ ఔషధాన్ని భారత్‌తో ఉత్పత్తి చేసేందుకు నాట్కో ఫార్మాతో గతంలోనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇప్పటికే ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 క్లినికల్‌ ట్రయల్స్‌ సైతం పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని నాట్కోఫార్మా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలను తగ్గిస్తున్నదని, కొవిడ్‌ రోగుల్లోనూ ప్రభావవంతంగా పనిచేస్తున్నదని నాట్కోఫార్మా పేర్కొంది.

మాల్‌నుపిరవిర్‌ను వినియోగించిన ఐదురోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించింది. దీంతో ఫేజ్‌ 3 క్లినికల్‌ ట్రయల్స్‌తోపాటు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో) దరఖాస్తు చేసినట్టు వెల్లడించింది. సీడీఎస్‌సీవో నుంచి అనుమతులు రాగానే వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసి, ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. తద్వారా సెకండ్‌వేవ్‌లో రోగుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేసింది.

Read Also….  Corona Pandemic: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కలిసి పనిచేస్తాం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోడీ సంయుక్త నిర్ణయం