Leaf Bag: సరికొత్త ఫాషన్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.. చాల్చాల్లే ఇలాంటివి చాలా చూశాం అని గాలి తీసేశారు నెటిజన్లు!

ఫాషన్ ప్రపంచం అంతులేని సాగరం.. అందులో మునిగి తెలేవాళ్ళకి నిత్యం సమరమే. ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించాల్సిందే. ఒక్కోసారి కొత్తదనం కోసం చేసే ప్రయత్నం బెడిసికోట్టిందంటే..

Leaf Bag: సరికొత్త ఫాషన్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.. చాల్చాల్లే ఇలాంటివి చాలా చూశాం అని గాలి తీసేశారు నెటిజన్లు!
Leaf Bags
Follow us
KVD Varma

|

Updated on: Apr 26, 2021 | 8:50 PM

Leaf Bag: ఫాషన్ ప్రపంచం అంతులేని సాగరం.. అందులో మునిగి తెలేవాళ్ళకి నిత్యం సమరమే. ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించాల్సిందే. ఒక్కోసారి కొత్తదనం కోసం చేసే ప్రయత్నం బెడిసికోట్టిందంటే.. అప్పటిదాకా విపరీతంగా సంపాదించిన పేరు సముద్రపు లోతుల్లోకి మునిగిపోతుంది. దాదాపుగా అటువంటిదే జరిగింది ఓ ఫ్యాషన్ డిజైనర్ కు ఆ వివరాలు..

ఈ మధ్యకాలంలో ఒక ఫాషన్ డిజైనర్ చేసిన ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ లేపింది. జీన్ పాల్ గౌల్టియర్ స్ప్రింగ్ ఒక ఫ్యాషన్ పరిచయం చేస్తూ ట్వీట్ చేశారు. అందులో అయన పరిచయం చేసింది ‘లీఫ్ బ్యాగ్స్’ అవును ఇవి నిజంగా ఆకులతో చేసిన బ్యాగులు. చూడ్డానికి బాగానే ఉన్నా, వీటిమీద నెటిజన్ల ట్రోలింగ్ విపరీతంగా నడుస్తోంది. ఆకులతో బ్యాగులేమిటి? నీ బొంద అనే లెవెల్ లో ఈ ట్వీట్ ను ట్రోల్ చేస్తున్నారు.. అంతేకాదు.. ఇదేమన్నా పెద్ద ఆర్టా.. మావూరిలో వెదురుతో ఇటువంటివి వందల కొలదీ చేస్తారు. అంటూ రకరకాల కామెంట్లతో ఆడేసుకుంటున్నారు. అయితే ఈ బ్యాగుల ట్వీట్ 86 వేల లైకులు వచ్చాయి. ట్వీట్ ఎంత బాగా నెటిజన్లు చూస్తున్నారో అంత బాగా కామెంట్లను కూడా లైక్ చేస్తున్నారు.

ఈ ట్వీట్ ఇక్కడ మీరు చూడొచ్చు..

ఈ ట్వీట్ పై వచ్చిన కామెంట్లను ఇక్కడ చూడండి..

ఇది ఫాషన్ లేక వ్య్వసాయమా? అని ఓ నెటిజన్ అడిగాడు.

ఫిలిప్పీన్స్ కు చందిన ఒక వ్యక్తి.. మేము ఇలా ఆకుల్లో భోజనం ప్యాక్ చేయించుకుంటాం అంటూ ట్వీట్ చేశాడు. ఇలా ఎన్నో ట్వీట్ లు ఈ లీఫ్ బ్యాగ్ కు బదులుగా దర్శనమిస్తున్నాయి. పాపం.. ఆ ఫాషన్ డిజైనర్.. ఎదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. అని పాడుకున్తున్నాదేమో బహుశా!

Also Read: లాక్ డౌన్ ప్రసక్తే లేదు, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటన, కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టీకరణ

Guinness World Records: పుషప్ స్టైల్ లో రింగును గిర గిర తిప్పిన వ్యక్తి.. గిన్నిస్ రికార్డ్ సాధించేశాడు.. ఈ వీడియో చూడండి..